మహేష్ బాబు కెరియర్ లో వచ్చిన అతడు సినిమాకు ఒక వైవిధ్యమైన రికార్డు ఉంది. ఈ సినిమా అప్పట్లో చెప్పుకో తగ్గ విజయం సాధించకపోయినా బుల్లితెర పై మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాను ప్రతినెలా ఎదో ఒక రోజున బుల్లితెర పై టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. టివిలో వచ్చిన ప్రతిసారి ఈ సినిమాను టివి ప్రేక్షకులు కొత్త సినిమాను చూసినట్లుగా చూస్తూనే ఉంటారు.  ప్రస్తుతం అదే పరిస్థితి మహేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘1’ కు కూడా వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా గతవారం విడుదలైన వెంటనే భయంకరమైన ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది, ఆ తరువాత మరో రెండురోజులు గడిచేసరికి ఫ్లాప్ టాక్ డివైడ్ టాక్ గా మారింది. పండుగ పూర్తి అయ్యేసరికి డివైడ్ టాక్ పాజిటివ్ టాక్ గా మారింది.  నెమ్మదిగా ఇదే టాక్ కొనసాగితే ఈ సినిమా ఫ్లాప్ గండం నుండి గట్టెక్కుతుంది. గతంలో వచ్చిన ‘అతడు’ సినిమా విషయంలో కూడ ఇలాగే జరిగింది. దీనితో ఈ సినిమాను ధియేటర్లలో చూసినవారికంటే బుల్లితెర పై చుసిన ప్రేక్షకులే ఎక్కువ. అందుకే రెండవసారి కూడ ‘అతడు’ సాటి లైట్ రైట్స్ మంచి ధర పలికింది.  అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ‘1’ సినిమా కూడ బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసే రోజులు త్వరలోనే వస్తాయి అని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: