బూతు సినిమాల దర్శకుడిగా పేరు గాంచిన మారుతీ తన ఇమేజ్ ను మార్చుకుందామని వెంకటేష్ కాంబినేషన్ లో చేయబోతున్న ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మారుతి సినిమా ‘రాథ’ మొదలు కాకముందే వివాదాలలోకి వెళ్ళింది.  తెలుస్తున్న సమాచారం మేరకు మారుతి పై శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఎసోసియేట్ గా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తి ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఈ కంప్లయింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే సతీష్ పాటల రచయిత సురేంద్ర కృష్ణ తో కలిసి ఓ స్క్రిప్టుని రెడీ చేసుకుని వెంకేటష్ కోసం వినిపించటం జరిగిందట.  ఇప్పుడదే స్క్రిప్టు కొద్ది మార్పులతో రాధ పేరుతో ప్రొడక్షన్ కి వెళ్తోందని కంప్లైంట్ లో సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివాదం దాసరి నారాయణ రావు దాకా వెళ్లినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు మారుతి ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు అని అంటున్నారు.  ఈనెల లాంచనంగా ప్రారంభమై వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా భవితవ్యం వస్తున్న వార్తలను బట్టీ ఈ సినిమా ముందుకు వెళుతుందా లేకుంటే ఆగిపోతుందా అనే విషయం పై రకరకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి. మారుతీ తన ఇమేజ్ ను మార్చుకుందామని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు కలిసి వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: