సూర్య విలక్షణ నటనకు నిలువెత్తు రూపం.. శివ పుత్రుడు సినిమాలో ఏదో అలా కాజువల్ గా తెలుగు వారిని పలుకరించిన సూర్య.. గజిని సినిమాతో ఇక్కడా స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అలరించిన సూర్య ఎప్పుడు తన సినిమాలు కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. యముడు ..సింఘం సినిమాల జోష్ ను కొనసాగిస్తున్న సూర్య ప్రస్తుతం లింగు స్వామి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ అంజాన్ అని డిసైడ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శనిర్మాతలు. ఈ మూవీ లో సమంత.. సూర్య తో రొమాన్స్ చేయనుంది. సాధారణంగా మంచి మాస్ ఫిలింస్ తీసే లింగు స్వామి అంజాన్ ని చాలా స్టైలిష్ గా కొత్తగా తెరకెక్కిస్తున్నాడట. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సూర్య ఈ సినిమా తర్వాత డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక అంజాన్ విషయానికొస్తే రీసెంట్ గా రిలీజ్ చేసిన సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. పోస్టర్ లో నే డిఫరెంట్ గా ప్రెసెంట్ చేపించిన లింగుస్వామి ఇక సినిమాను కచ్చితంగా చాలా డిఫరెంట్ టేకింగ్ తో తీసుంటాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు సూర్య అభిమానులు. యూ టీవి కో ప్రొడ్యూసర్స్ తిరుపతి బ్రదర్స్ అంజాన్ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య అంజాన్ గా అందరిని అలరించాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: