సినిమా వాళ్లంటే అందరికీ క్రేజ్ అని వారికి సంబందించిన ఏ విషయమైనా సరే వారికంటే ముందు మీడీయా వారే కాంచుకుని రాసి చివరకు వారంతట వారు తెలుసుకునేలా చేస్తారు.. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే అల్లు వారి ఇంటి విషయంలో జరిగింది. అల్లు అర్జున్.. స్నేహా రెడ్డి వివాహం అయిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ నెల 15 న స్నేహా రెడ్డి ఆడపిల్లకు జన్మనిచ్చిందని కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలొచ్చాయి.. అవి అటు చేరి ఇటు చేరి సొంత గూటికి చేరి వారిని షాక్ అయ్యేలా చేసాయి.. దానికి ఆ ఇంటి పెద్దాయన అల్లు అరవింద్ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు.. స్నేహా ప్రెగ్నెన్సీ తో ఉండటం వాస్తవమే కానీ తన డెలివరీ కి ఇంకా టైం ఉంది ఈలోపు మీరు ఏవేవో ఊహించుకుని రాయడం మంచిది కాదు అని చెప్పాడు. పాపం అభిమానులు అల్లు వారింట్లో ఆడపిల్ల పుట్టిందని తెలిసి పండుగ చేసుకున్న వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. అయినా వీళ్లు మాత్రం కరెక్ట్ ఇన్ ఫర్మేషన్ ఉంటేనే రాస్తే పోలా ఎందుకు లేనిపోనివి కల్పించి వారిని ఇబ్బంది పెట్టడం అని అనుకుంటున్నారు సినీ జనాలు. అయినా సినిమా వాళ్లకు ఇది కామనే అని లైట్ తీసుకున్న వారు లేకపోలేదు. పండుగ రోజు ఈ గాసిప్ ని చూసి బన్నీ నవ్వుకుని ఉంటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: