ప‌వ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టామినా ఏంటో అంద‌రికి తెలుసు. టాలీవుడ్ బాక్సాపీస్‌ను షేక్ చేయించ‌గ‌ల స‌త్తా ప‌వ‌న్‌కు మాత్రమే ఉందంటూ లేటెస్ట్‌గా ఎక్స్‌ట్రీమ్ బాక్సాపీస్ రికార్డ్స్‌ను క్రియోట్ చేసిన అత్తారింటికి దారేది మూవీను చూస్తే తెలిసిపోతుందంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మూవీల బాక్సాపీస్‌ను మాత్రమే కాదు, త‌న బ్లెస్సింగ్స్‌తో రిలీజ్ అయిన ఏ మూవీ అయినా, బాక్సాపీస్ రేంజ్ కూడ అదే విధంగా ఉంటుంది అంటాడు. ప‌వ‌న్ ఆశీస్సుల‌తో నితిన్ మూవీలు ఏ రేంజ్ హిట్స్ అందుకున్నవో ఇప్పటికే అంద‌రికి తెలుసు. అయితే మెగా ఫ్యామిలి నుండి వ‌స్తున్న మ‌రో హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఈ హీరో వైవియ‌స్‌.చౌద‌రి స్వీయ నిర్మాణ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న రేయ్ మూవీతో, టాలీవుడ్ స్క్రీన్‌ను డెబ్యూగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మొద‌టి మూవీతోనే మెగా ఫ్యామిలి హీరోల అండ‌దండ‌ల‌ను పుష్కలంగా వెన్నంట ఉంచుకున్నాడు. రేయ్ మూవీ ఆడియో ఫంక్షన్ ఈ నెల 17న ఘ‌నంగా జ‌రుగుతుంది. శిల్పక‌ళావేధిక‌లో జ‌రిగే ఆ ఫంక్షన్‌కు మెగా హీరోలు అంద‌రూ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చింర‌జీవి, అల్లుఅర్జున్‌,రామ్‌చ‌ర‌ణ్ ఈ ఆడియో ఫంక్షన్‌కు వ‌స్తున్నట్టు వైవియ‌స్‌.చౌద‌రి వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు తెలుపుతున్నాయి. అయితే వైవియ‌స్ మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌కు రాకుంటే, చివ‌రి నిముషంలో సైతం ఆడియో ఫంక్షన్ డేట్‌ను మార్చేయ‌టానికి సిద్ధంగా ఉన్నట్టు, ప‌వ‌న్‌కు మెసేజ్‌ పంపాడ‌ట‌. అంతే కాకుండా ప‌వ‌న్ బ్లెస్సింగ్ లేకుండా మూవీను రిలీజ్ చేయడం కుద‌ర‌దు అంటున్నాడు. ఇందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి ఎటువంటి ఆన్సర్ వ‌స్తుందో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: