ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘రేయ్’ ఆడియో వేడుక ఇన్విటేషన్ లో పవన్ కళ్యాణ్ పేరు అతిధిగా కనపడుతూ ఉండటంతో పవన్ ఈ వేడుకకు వస్తున్నాడన్న విషయం పై క్లారిటీ వచ్చింది. దీనితో పవన్ మూడవ వివాహానికి సంభందించి విపరీతంగా వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకకు అనుకోని క్రేజ్ ఏర్పడింది. నేటి సాయంత్రం శిల్పకళా వేదికలో ఆడియో వేడుక జరుగనుంది.  వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చే ‘రేయ్' చిత్రం ద్వారా సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు వైవిఎస్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌తో ‘రేయ్' మూవీ A టు Z లుక్ విడుదల చేయించిన ఆయన ఇపుడు పవర్ స్టార్‌తో ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ‘రేయ్’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అలా కనిపిస్తాడు అని ప్రచారం జరుగుతోంది.  ఈ మధ్యనే రిలీజ్ అయిన ‘రేయ్' ప్రెస్ స్టిల్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి సాయిధరమ్ తేజ్ స్టిల్స్‌లో నాలాగే ఉన్నాడని దర్శక నిర్మాత చౌదరితో చెప్పాడట. ఆ స్టిల్ష్ చూసిన వారంతా సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్‌లా ఉన్నాడని ప్రశంస్తున్నారని చౌదరి అంటున్నాడు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్', ‘బాలు' సినిమాల్లో ఆయన వాడిని పాంట్స్‌ని సాయి ధరమ్ తేజ్‌కు వాడమని కూడ చౌదరి చెపుతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలాఉన్నా పవన్ రాకతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: