అదేంటి అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ కన్ ఫాం అయ్యిందా..? తను చేయబోయే మొదటి సినిమా పేరు వైస్ కెప్టెనా..? అనే కదా మీ డౌట్..? అదేం కాదులేండి. మన కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో అన్ని సీజన్స్ లో మంచి బ్యాటింగ్ నైపుణ్యంతో అలరిస్తూ వచ్చాడు అఖిల్. ఇప్పుడు తను రాబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నాలుగో సీజన్ లో వైస్ కెప్టెన్ గా చేయబోతున్నాడు. ఒక రకంగా అక్కినేని అభిమానులకు ఇది మంచి విషయమనే చెప్పాలి.. వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ సీసియల్ సీజన్ ఈ నెల 25 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులు జట్టులో ఎంపికయ్యారు. వారు షూటింగ్ లు ముగించుకుని ఈవింగ్ టైం లో క్రికెట్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టమని మనకు తెలుసు అందుకే ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కి తానే ముందుండి నడిపిస్తున్నాడు. ఇక అఖిల్ ని వైస్ కెప్టెన్ గా తీసుకోవడం పై జట్టు సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.. తను మంచి టాలెంటెడ్ ఆటగాడు కాబట్టి అతనికి వైస్ కెప్టెన్ ని ఇవ్వడం తప్పులేదని వరు అభిప్రాయపడ్డారు. తను వైస్ కెప్టెన్ గా చేస్తున్న సంగతి తెలియగానే అఖిల్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంకా తను టాలీవుడ్ జట్టుకి వైస్ కెప్టెన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని కూడా మెసేజ్ లో రాశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: