సంక్రాంతి పండుగ అనగానే మనకు చటుక్కును పతంగులు ఎగురవేయడం గుర్తొస్తుంది. పతంగుల పోటీ అందరినీ ఆకర్షిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఓ ఆసక్తికరమైన ఫొటో పతంగులపై కనిపించింది. పతంగులు ఎగురవేసే వారు, తెగి కింద పడిపోయిన పతంగులను చూసి ఎవరు ఈ అజయ్‌ శాస్ర్తి అని చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. ఒకటి కాదు రెండు కాదు వందల్లో, వేలల్లో గాలిపటాలు హైదరాబాద్‌లో పెద్ద చర్చకు తెర తీశాయి. అజయ్‌ శాస్ర్తి మిస్సింగ్‌ అని ముద్రించిన పతంగులు ఇక్కడ హల్‌చల్‌ చేయడమే అందుకు కారణం. అసలు అజయ్‌శాస్ర్తి ఎవరు? వ్యక్తి మిస్సయితే పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వాలిగానీ ఈ విధంగా చేయడం ఏమిటని పంతంగుల ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. కానీ అజయ్‌శాస్ర్తిని వెతకడానికి అతని భార్య అనామిక శాస్ర్తి ఇలా చేస్తోంది. మరి ఈ పతంగుల గేమ్‌ అనామికకు ఉపయోగపడిందా అనేది తెలియాలంటే శేఖర్‌ కమ్ముల స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్నఅనామిక చిత్రం వచ్చేంత వరకు ఆగాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: