రామ్ చరణ్ తన ప్రతి సినిమాలోను తన తండ్రి సినిమాలలోని పాటలను రీమిక్స్ చేసి చిరంజీవి ఇమేజ్ తనకు ఉపయోగ పడేలా చేస్తుంటాడు. ఈ సెంటిమెంట్ తనకు బాగా కలిసి వచ్చిందని చరణ్ నమ్మకం. చరణ్ సినిమాలలో ‘ఎవడు’కి ముందు వచ్చిన హిట్‌ సినిమాలు అన్నిట్లోను చిరంజీవి పాటల రీమిక్స్‌ ఉంది.  అయితే ‘ఎవడు’లో చిరు రీమిక్స్‌ లేదు కాబట్టి సెంటిమెంటల్‌గా కలిసి రాదేమో అని భయపడ్డాడు చరణ్. కానీ ‘ఎవడు’ అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. సంక్రాంతి రేస్ లో విజేత గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఈ సినిమాలో ఒకచోట చిరంజీవి పోస్టర్‌ని చూపించి, పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ సీన్‌ చూపించి మెగా ఫాన్స్‌ని అలరించడానికి ప్రయత్నించాడు చెర్రి. అదే విధంగా ఈసినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి ఎలాంటి ఫ్యామిలీ రిఫరెన్సులు లేకుండా డైలాగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటు వీలైనంత ఎక్కువగా చరణ్ ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు.  ఈ సినిమా రొటీన్‌ సినిమా అనే ముద్ర పడినా, మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో దిల్ రాజ్ కు అదృష్ట లక్ష్మిగా మారింది. అంతేకాదు గత ఆరు నెలలుగా చరణ్ ను పీడిస్తున్న నిరాశకు ఈ సినిమా మంచి జోష్ ను ఇస్తోంది. బిసి సెంటర్లలో ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమా మొదటి వారంలోనే ముప్పయ్‌ అయిదు కోట్లకి పైగా షేర్‌ రావడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.  ఈ నెలాఖరు వరకు మరి ఏ పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో చరణ్ ‘ఎవడు’ 50 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్య పోనక్కరలేదు అని అంటున్నారు. ఎదిఎమైనా ఎన్నో వాయిదాలు పడ్డ ‘ఎవడు’ ఊహించని విధంగా సక్సస్ కావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: