మెగా హీరోల సర‌స‌న హీరోయిన్‌ ఆఫ‌ర్ అంటే సామాన్య విష‌యం కాదు. అదీను వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయంటే ఆ హీరోయిన్‌కి నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ఖాయం అని అంటారు. అయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రు అంటే స‌మంత అనే అంటారు. రీసెంట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మంత హీరోయిన్‌గా న‌టించి, ఇప్పుడు మ‌రో మెగా హీరో మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్రివిక్రమ్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌తో వ‌స్తున్న అప్‌క‌మింగ్ మూవీలో హీరోయిన్‌గా స‌మంత క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. త్రివిక్రమ్‌తో స‌మంత ఇది రెండో మూవీ చేస్తుంది. అదీనూ అత్తారింటికిదారేది లాంటి బ్లాక్‌బ‌స్టర్ మూవీ త‌రువాత స‌మంత ఒప్పుకున్న మొద‌టి మూవీ ఇది. నిజానికి అల్లుఅర్జున్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టించాల్సి ఉండ‌గా, చివ‌రినిముషంలో ఆ ఆఫ‌ర్‌ సమంతకు వ‌రించింది. అయితే స‌మంత మాత్రం ఈ ఆఫ‌ర్‌పై సంతోషంగా ఉన్నప్పటికి త‌న రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం త‌గ్గేది లేదంటుంది. మూవీకు కోటి రూపాయ‌లను డిమాండ్ చేసిన‌ట్టు విశ్వశ‌నీయ స‌మాచారంగా తెలుస్తుంది. అయితే స‌మంత అడిగిన రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించే ప‌నిగా అల్లుఅర్జున్ త‌న వంతుగా చ‌ర్చలు జ‌రిపినా స‌మంత మాత్రం నో అన్నట్టు చెప్పింది. చివ‌రికి త్రివిక్రమ్ రంగంలోకి దిగి మ‌రో మూవీకు ఆఫ‌ర్ ఇస్తాన‌ని క‌న్విన్స్ చేయ‌డంతో చివ‌ర‌కు 90 ల‌క్షల‌కు ఓకె అన్నట్టు ప్రస్తుత స‌మాచారం. స‌మంత‌కు ఒక్కసారిగా స్టార్‌డం పెరిగిపోవ‌డంతో ఏ హీరో అయినా రెమ్యున‌రేష‌న్ త‌రువాతే అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: