టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో అతి పెద్ద మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ తెర‌కెక్కబోతుంద‌నే వార్తలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఇందులోనూ ప్రిన్స్ మ‌హేష్‌భాబు మ‌రోసారి జోడి క‌డుతున్నాడ‌ని తెలియ‌డంతో ఈ మూవీపై టాలీవుడ్‌లో తెగ ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌కి మ‌ణిర‌త్నం డైరెక్టర్‌గా చేస్తున్నాడు. మ‌ణిర‌త్నం డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోలుగా ప్రిన్స్ మ‌హేష్‌బాబు, టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌పై ఇప్పటి వ‌ర‌కూ ఎవ్వరూ అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్‌ను ఇవ్వలేదు. ఒక్క మ‌ణిర‌త్నం మాత్రం కోలీవుడ్ మీడియా దీనికి సంబంధించిన న్యూస్ నిజం అంటూ తెలియ‌ప‌రిచాడు. అలాగే మ‌రికొన్ని డిటైల్స్‌ను అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేస్తాన‌ని చెప్పడంతో మ‌ణిర‌త్నం డైరెక్షన్‌లో మల్టీస్టార‌ర్ ఫిల్మ్ అంటూ వార్తలు జోరందుకున్నాయి. లేటెస్ట్‌గా ఈ న్యూస్‌పై కింగ్ నాగార్జున అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చాడు. 'నేను, మ‌హేష్‌బాబుతో ఓ మూవీలో న‌టిస్తున్నాను. ఈ మూవీకు డైరెక్టర్ మ‌ణిర‌త్నం. మ‌ణిరత్నం ఈ విష‌యాన్ని నాకు చెబితే దాన్ని వెంట‌నే ఒప్పుకున్నాను. మ‌హేష్‌తో నాకు మంచి రిలేష‌న్ ఉంది. త‌న‌తో ప‌ని చేయ‌టానికి నాకు ఎటువంటి అభ్యంత‌రాలు లేవు' అని చెప్పాడు. అంతే కాకుండా ఈ మూవీకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను మ‌ణిర‌త్నం త్వర‌లోనే రెడీ చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఆగ‌ష్టు నెల‌లో ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: