టాలీవుడ్‌లో అత్యంత విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుకుమార్ వ‌న్ మూవీ త‌రువాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ బ‌డ్జెట్ మూవీను డైరెక్ట్ చేస్తాడ‌ని న్యూస్ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు అత్తారింటికిదారేది నిర్మాత బివియ‌స్‌య‌న్‌.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రి ప్రొడ‌క్షన్ ప‌నులు ఊపందుకుంటున్న స‌మయంలోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌నే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుంది. వ‌న్ మూవీ స‌క్సెస్ రిజ‌ల్ట్‌ను చూసిన ఎన్టీఆర్‌, ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశాడ‌ని టాక్ వినిపిస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన వ‌న్ మూవీ, బాక్సాపీస్ వ‌ద్ద వైఫ‌ల్యాన్ని చ‌విచూడ‌టంతో, ఆ ఎఫెక్ట్ సుకుమార్ త‌రువాతి మూవీపై ఉంటుంద‌ని కొంద‌రు చెబుతున్నారు. అంటే సుకుమార్ వ‌న్ మూవీ త‌రువాత యంగ్ టైగ‌ర్‌తో మూవీను చేస్తున్నాడు కాబ‌ట్టి, ఈ కాంబినేష‌న్‌పై మొద‌టి నుండే నెగిటివ్ టాక్ రావ‌డం ఖాయం అని అంచ‌నాలు జ‌రుగుతున్నాయి. అందుకే సుకుమార్‌తో ప్రాజెక్ట్‌ను య‌న్టీఆర్ క్యాన్సిల్ చేశాడ‌ని, మ‌రో బ‌ల‌మైన క‌థ ఉన్న ద‌ర్శకుడితో మూవీ చేయ‌టానికి ఆస‌క్తి చూపుతున్నాడ‌ని ప్రొడ‌క్షన్ హౌస్ నుండి అందిన స‌మాచారం. ప్రస్తుతం యంగ్‌టైగ‌ర్, సంతోష శ్రీనివాస్ ద‌ర్శక‌త్వంలో ర‌భ‌స మూవీను చేస్తున్నాడు. ఈ మూవీ క‌థ‌లోనూ ప‌లుసార్లు మార్పులు జ‌రిగాయి. రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ త‌రువాత వ‌స్తున్న చిత్రం ర‌భ‌స కావ‌డంతో, ఈ మూవీ అవుట్‌పుట్ ఏ విధంగా వ‌స్తుందో అని టాలీవుడ్ సైతం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ర‌భ‌స మూవీపై ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధను తీసుకోవ‌డంతో ఈ మూవీ అవుట్‌పుట్‌పై ఆస‌క్తి పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: