మెగా కుటుంబ మరో వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయం అవుతున్న సాయి ధరమ్ తేజ్ తన తొలి సినిమా ‘రేయ్’ ఆడియో వేడుకలో తన పై తన మేనమామల ప్రభావాన్ని చాల చాకచక్యంగా చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.  చిరంజీవిగారి పట్టుదల, కృషిని, నాగబాబుగారి నిదానo, నవ్వు, పవన్ కళ్యాణ్‌ క్రమశిక్షణ, నిబద్ధతను కలిపితే ఒక సాయి ధరమ్ తేజ్ గా మీముందు ఉన్నానని అంటు తమ మేనమామల వద్ద ఎంతో నేర్చుకున్నాను, వారి చేతుల మీద పెరిగాను, మెగా అభిమానులను నిరాసపరచను అని అనడం వెనుక ఈ కొత్త మెగా హీరో అప్పుడే సినిమా తెలివి తేటలను అలవరచు కున్నాడు అంటు ఆ వేడుకకు వచ్చిన అతిధులు సెటైర్లు వేయడం వినిపించింది.  దీనికి మరో ట్విస్ట్ ఇస్తూ ‘‘నా మనవడికి నా పోలిక అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. తనకు పెద్ద మేనమామ చిరంజీవి పోలిక వచ్చింది’’ అని అంజనా దేవి అనడం మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తి వేసింది. ఈ వేడుకకు యాంకర్ గా వ్యవహరించిన సుమ చిరంజీవి డాన్స్ నేర్చుకోవడానికి సాయి ధరమ్ తేజ్ తల్లి ప్రోత్సాహం చిరూను మెగా డాన్స్ స్టార్ గా మార్చింది అంటు చాలామందికి తెలియని కొత్త విషయాన్ని తెలియచేసింది సుమ. ఎదిఎమైనా సాయి ధరమ్ తేజ్ హీరో లాంచింగ్ పవన్ చేతుల మీద ఘనంగా జరిగిందనే చెప్పుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: