ప్రిన్స్ మ‌హేష్‌బాబు త‌న ఫిల్మ్ షెడ్యూల్స్‌ను చాలా స్పీడ్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. వ‌న్ మూవీ త‌రువాత వెంట‌నే కొర‌టాల శివతో డైరెక్ట్ చేస్తున్న యుటివి మోష‌న్స్ పిక్చర్స్‌లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ త‌రువాత షూటింగ్ ఇంకా స్టార్ట్ కాక ముందే మ‌రో మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాల్షీట్స్ 2015 చివ‌రి వ‌ర‌కూ ఖాలీగా లేవని అంటున్నారు. అయితే ప్రిన్స్ మ‌హేష్‌బాబు టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వంశీ పైడిప‌ల్లికి ఈసారి అవ‌కాశం ఇచ్చాడు. ఎవ‌డు మూవీ స‌క్సెస్‌తో వంశీ పైడిప‌ల్లి, మ‌హేష్‌బాబును ఆక‌ట్టుకున్నాడు. స్లైలిష్ అండ్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌న మూవీల‌ను తెర‌కెక్కించి బాక్సాపీస్ వ‌ద్ద మంచి రిజ‌ల్ట్స్‌ను తీసుకురావ‌డంతో వంశీకు స్టార్‌డైరెక్టర్ పొజిష‌న్‌ను తెచ్చిపెట్టాయి. అయితే వంశీ తీసిన మున్నా మూవీ మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద ప్లాప్‌ను తెచ్చినా, త‌రువాత వ‌చ్చిన బృందావ‌నం, ఎవ‌డు మూవీలు స‌క్సెస్‌ను తెచ్చిప‌ట్టాయి. రీసెంట్‌గా మ‌హేష్‌బాబుకు ఓ క‌థ‌ను వినిపించాడు వంశీ పైడిప‌ల్లి. వంశీ చెప్పిన క‌థ‌కు మ‌హేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టుగా టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాడు. త్వర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప‌నులు ముందుకు వెళ‌యని టాలీవుడ్ స‌మాచారం. అయితే దీనికి సంబంధించిన అఫిష‌య‌ల్ అనౌన్స్‌మెంట్‌ను కూడ త్వర‌లోనే ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైన వీరిద్దరి కాంబినేష‌న్ ఎలా ఉంటుందో అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: