నందమూరి తారకరామారావు పేరు వినగానే ఎవరికైనా దైవత్వానికి ప్రతీకలైన ఒక రాముడు లేదా మరో కృష్ణుడు వెంటనే గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ మన తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన నడవడి, ఏకాగ్రత, పట్టుదల ఈ తరం వారికే కాదు, భావితరాల వారికి కూడా ఆదర్శం. ఆయన ఎన్నో వందల పాత్రలలో నటించి మెప్పించాడు. చిన్న వయసులోనే వయసు పై బడిన భీష్ముడిగా, బృహన్నల గా ఇలా ఏ పాత్రకు ఆపాత్ర భిన్నంగా ఉంటాయి ఎన్టీఆర్ పాత్రలు.  ఒక నెగిటివ్ పాత్రను పాజిటివ్ పాత్రగా మెప్పించగల గొప్పతనం ఆయనకు మాత్రమే సొంతం. రాముడైనా ,కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా వెండి తెర దేవుడిగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో శాశ్విత స్ధానాన్ని ఆక్రమించుకున్న మహానటుడు నందమూరి. ఎన్టీఆర్ కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినిమా ప్రతిష్ఠనే కాకుండా తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు.  ఎన్టీఆర్‌ నటజీవితంలో ఒక మైలు రాయిగా ‘మాయాబజార్‌’ సినిమాను చెపుతారు. ఆ సినిమాలో తొలిసారిగా కృష్ణుడిగా కనిపించిన ఎన్టీఆర్‌ ఆ తరువాత ఏకదాటిగా 18 సార్లు అదే పాత్రను ధరించి రికార్డు సృష్టించారు. ప్రపంచంలో మరె నటుడు ఇలా ఒకే పాత్రను అన్ని సార్లు పొషించి మెప్పించిన దాఖలాలు లేవు. అది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైన అద్భుత విషయం. ముఖ్యంగా రావణాబ్రహ్మ, కీచకుడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అమోఘం అనిర్వచనీయం. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘీకం. ఇలా ఆయన చేయని పాత్రలేదు.  ఇవన్నీ ఒక ఎతైతే రాజకీయాలలో ఎన్టీఆర్ సృస్టించిన సంచలనాలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకూ సృస్టించ లేకపోయాడు. కేవలం తొమ్మిది నెలలలో తను స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క నందమూరికే సొంతం. ఆయన చనిపోయి 18 సంవత్సరాలు అయిపోయినా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన పదకాల గురించి పేద ప్రజలు ఇంకా గుర్తుంచు కున్నారు అంటే నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ జీవితం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: