ఒకప్పుడు కథానాయికలు ముద్దు సన్నివేశాలు ఉంటే తాము నటించమని చెప్పేవారు. కానీ కాలం మారడంతో ఎక్కువ పారితోషికం ఇస్తే ముద్దు సీన్ లకు ఓకే చెపుతున్నారు నేటి హీరోయిన్లు. అయితే వీరందరిని మించి పోయి ఒక అడుగు ముందుకు వేసింది ఓ కేరళా ముద్దు గుమ్మ.  అసలు ముద్దులో అశ్లీలం ఏముంది? అని ప్రశ్నిస్తోంది వర్ధమాన నటి లక్ష్మీమీనన్. మొన్నటి వరకు గ్లామర్ పక్కకే వెళ్లనని స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్‌కు ఓకే చెప్పేసింది. పైగా అదేం తప్పు కాదే అంటోంది. నటుడు విశాల్‌తో మరోసారి జంటగా నటి స్తున్న ఈమె ఫై ఇప్పటికే కోలీవుడ్ మీడియా తెగ రాతలు రాస్తోంది.  ఈ సినిమాలో విశాల్ తో ఈమె ఒక ముద్దు సీన్ లో రెచ్చిపోయి నటించిందని టాక్. అంతేకాదు ఆపాత్రకు చాలా ప్రాముఖ్యం ఉండడంతో అలా నటించానని చెపుతోంది. గతంలో విశాల్‌తో ఇంతకుముందు ‘పాండియనాడు’ చిత్రంలో నటించిన ఈమెకు విశాల్ కు ఏదో నడుస్తోందని కోలీవుడ్ టాక్.  ముద్దులో అశ్లీలం ఉండదు, గ్లామర్ కూడా ఉండదు కేవలం భావ ప్రకటన మాత్రమే అని చెపుతున్న ఈమె మాటలకు కోలీవుడ్ మీడియా దిమ్మ తిరిగి పోతోంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: