టాలీవుడ్‌లో ఓ సరికొత్త కాంబినేష‌న్‌కు తెర‌లేచింది. అక్కినేని నాగార్జున‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో ఓ మూవీ రాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని డిటైల్స్ త్వర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి. నాగార్జున‌, మ‌హేష్‌బాబు న‌టిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీకు స్టార్ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. అంతేకాకుండా ఈ మూవీలో కొంత వ‌ర‌కూ నిర్మాత బాధ్యత‌ల‌నూ మ‌ణిర‌త్నం తీసుకున్నాడు. మ‌ణిర‌త్నం, మ‌రో కార్పోరేట్ సంస్థ క‌లిసి ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీను బారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ సెల‌క్షన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో నాగార్జున స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తుంద‌ని కోలీవుడ్ మీడియ క‌న్‌ఫ‌ర్మ్ చేసింది. మ‌ణిర‌త్నం ఆఫిస్ నుండి న‌య‌న‌తార‌కు ఫోన్ వ‌చ్చింద‌ని, నాగార్జున స‌ర‌స‌న న‌టిస్తారా అని అడ‌గ‌టంతో వెంట‌నే కాద‌న‌కుండా ఒప్పుకుంద‌ని కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి అందిన విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం. న‌య‌న‌తార‌, నాగార్జున ఇప్పటికే ప‌లు చిత్రాల్లో న‌టించ‌డంతో వీరి కాంబినేష‌న్ చూడ‌టానికి బాగుంటుంద‌ని టాలీవుడ్ కూడ అంటుంది. అయితే ఇప్పుడు మిగిలింది ప్రిన్స్ స‌ర‌స‌న ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు అన్నదే. ప్రిన్స్ స‌ర‌సన కాజ‌ల్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ నుండి అందిన స‌మాచారం. అయితే ప్రిన్స్ మాత్రం మ‌ళ్ళీ కొత్త హీరోయిన్‌కే ఆస‌క్తి చూపుతున్నాడంట‌. ఇదిలా ఉంటే ఈ మూవీను ఒకేసారి తెలుగు, త‌మిళ్ బాష‌ల్లో నిర్మిస్తున్నారు. త‌మిళ్ భాష‌లో కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో కూడ ఇందులో క‌నిపించే అవ‌కాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: