మెగా హీరోలు వ‌రుస‌గా రికార్డ్స్ ను క్రియోట్ చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇది మూవీల‌లో కాదు. మైక్రో బ్లాగింగ్ నెట్ వ‌ర్క్స్ లో మెగా హీరో అల్లుఅర్జున్, రామ్‌చ‌ర‌ణ్ ఇద్దరూ వ‌రుస రికార్డ్ ల‌ను క్రియోట్ చేస్తున్నారు. గ‌త కొద్ది కాలం క్రితం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫేస్‌బుక్‌లో త‌న ఫాలోవ‌ర్స్ ను మిలియంకు పెంచుకున్నాడు. టాలీవుడ్‌లో మిలినియం లైక్స్ క‌లిగిన మొద‌టి హీరోగా అల్లుఅర్జున్ రికార్డ్ ను క్రియోట్ చేశాడు. ఇప్పుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో మిలినియం లైక్స్ ను సంపాదించాడు. దీంతో అల్లుఅర్జున్‌,రామ్‌చ‌ర‌ణ్ ఇద్దరూ సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్ లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో వ్యక్తిగ‌త విష‌యాల‌ను సైతం పోస్ట్ చేయ‌డంతో ఫాలోవ‌ర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అలాగే ఎవ‌డు మూవీకు సంబంధించిన విష‌యాల‌ను త‌నే అనౌన్స్ చేయ‌డం వంటివి, త‌న ఫాలోవ‌ర్స్ గా మార‌టానికి ప్లస్ అయ్యింది. ఈ విధంగా మెగా హీరోలు ఇద్దరూ వ‌రుస రికార్డ్ ల‌ను క్రియోట్ చేస్తూ అటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ, ఇటు సోషియ‌ల్ నెట్‌వ‌ర్స్ లోనూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ , కృష్ణవంశీ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన ఎవ‌డు మూవీ స‌క్సెస్ సాధించ‌డంతో, ప్ర‌స్తుతానికి ఎవ‌డు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: