‘ఎవడు’ సినిమా అంచనాలకు మించి హిట్ కావడంతో రామ్ చరణ్ మంచి జోష్ మీద ఉండడమే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను ఫిబ్రవరి మొదటి వారం నుండి పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అన్నగా శ్రీకాంత్ నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీకాంత్ కు జోడీగా చరణ్ కు వదినగా కమలనీ ముఖర్జీ నటించడం సంచలనంగా మారింది.  బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 6న ప్రారంభమవుతుంది. ఇప్పటికే చరణ్‌ సరసన హీరోయిన్ గా ఇదివరకే కాజల్‌ని ఎంచుకొన్నారు అన్న వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో శ్రీకాంత్‌ సరసన కమలినీ ముఖర్జీని 'విరోధి' చిత్రంలో జంటగా నటించారు.  ఇప్పుడు మరోసారి జతకట్టనున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం కమిలినీ ముఖర్జీకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని అంటున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న శ్రీకాంత్ కు, అదేవిధంగా అదే ఫ్లాప్ ల పంధాలో పయనిస్తున్న కమిలినీ ముఖర్జీకి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో శ్రీకాంత్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఖడ్గం,మహాత్మా సినిమాలలో నటించి మెప్పించన విషయం తెలిసిందే.  ‘ఎవడు’ సక్సస్ తరువాత చరణ్ మళ్ళీ తన పూర్వ క్రేజ్ మాస్ ప్రేక్షకులలో తిరిగి పొందడంతో ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందినా ఈ సినిమాకు కూడా భారీ ఓపినింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరాకు ఈ సినిమా విడుదల అవుతుంది అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: