ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సినిమాల్లో క‌నిపించే హీరోయిజ‌మ్ మాత్రమే కాదు. మ‌న‌కు క‌నిపించ‌ని మాన‌వ‌నీయ విలువ‌లు కూడ ఉన్నాయి. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీల‌ను చూసి ఫ్యాన్ ఫాలోయింగ్‌గా ఎంత మంది మారతారో, స‌మాజంపై అత‌ని వ్యక్తిగ‌త అభిప్రాయ‌ల‌ను ఇష్టప‌డి అంతే మంది ఫాలోవ‌ర్స్ గా మార‌తారు. అందుకే ప‌వ‌న్ అంటే అంద‌రికి అంత క్రేజ్‌. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యంలో స‌మాజ‌సేవ అంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని అయినా ఆ వ్యక్తుల‌ను కాపాడాల‌ని అనేదే ధ్యేయంగా పెట్టుకుంటాడు. అందుకే త‌న ద‌గ్గర ప‌ని చేసేవాళ్ళు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధంగానే ఉంటారు. ఈ విష‌యాల‌న్నింటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌న్నిహితంగా ఉండే కొద్ది పాటి మిత్రులు చెప్పుకునే మాట‌లు. అయితే ఆ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమాల్లో సీనియ‌ర్ న‌టిగా ఉంటూ ఎన్నో వైవిధ్యమైన‌, హాస్యభ‌రిత‌మైన పాత్రలు చేసిన పావ‌ల శ్యామ‌ల‌కు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎవ్వరూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌వ‌న్ త‌న వంతుగా సాయం చేశాడు. అలాగే రైఫిల్ షూటింగ్‌లో ఉత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న రేఖి అనే యువ‌తి ఆర్ధిక సాయం చేసి, ఉన్నత శిక్షణ‌కు తోడ్పడ్డాడు. అలాగే మూత్రపిండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌తికి రెండు ల‌క్ష‌లు ఇచ్చి ఆదుకున్నాడు. రీసెంట్‌గా క‌ష్టాల్లో ఉన్న సినీ న‌టిను ప‌వ‌న్ ఆదుకున్నాడ‌ని టాలీవుడ్ చెబుతుంది. ఈ విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాజ సేవ చూస్తూ ప‌వ‌నిజాన్ని చాటున్నాడ‌ని, తాజాగా ఆర్ధిక సాయాన్ని అందుకున్న ఆ న‌టి త‌న మ‌న‌స్సులోని మాట‌ల‌ను చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: