ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓవ‌ర్సీస్ మార్కెట్‌ను ప్రిన్స్ మ‌హేష్‌బాబు బీట్ చేశాడు. ఇప్పటి వ‌ర‌కూ మ‌హేష్‌బాబుకి ఓవ‌ర్సీస్ మార్కెట్ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, ప‌వ‌న్ ఓవ‌ర్సీస్ మార్కెట్‌ను చూసిన‌ ట్రేడ్ పండితులు అంచ‌నాలు వేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బర్‌సింగ్ ఓవ‌ర్సీస్ మార్కెట్ క‌లెక్ష‌న్స్ ఆరు కోట్ల రూపాలుగా ఉంటే ఆ క‌లెక్షన్స్ ను ప్రిన్స్ మ‌హేష్‌బాబు కేవ‌లం ఒకే ఒక్క వారంలో బీట్ చేశాడు. దీంతో ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్‌బాబు మార్కెట్ ఎక్కువుగా ఉంద‌ని తేలింది. ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన వ‌న్‌-నేనొక్కడినే మూవీ, మొద‌టి వారం క‌లెక్షన్స్ ఆరు కోట్లరూపాల‌య‌ను దాటింది. తెలుగులో వ‌న్ మూవీకు క‌లెక్షన్స్ అంత‌గా రాక‌పోతున్న‌ప్ప‌టి, ఎ క్లాస్ ఆడియ‌న్స్ ను మాత్రం వ‌న్ మూవీ బాగానే ఆక‌ట్టుకుంటుంది. ఈ విధంగా ఓవ‌ర్సిస్‌లో అయితే వ‌న్ మూవీకు అంద‌రూ తెగ ఆస‌క్తి చూపించారు. దీంతో వ‌న్ మూవీ ఓవ‌ర్సీస్ మార్కెట్ ఓ రేంజ్‌లో విజృంభించింది. అలాగే అత్తారింటికిదారేది ఓవ‌ర్సీస్ మార్కెట్‌ను సైతం మ‌హేష్ త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ తో క్రాస్ చేస్తాడ‌ని అంటున్నారు. ప్రస్తుతం మ‌హేష్‌బాబు ఆగడు మూవీకు సంబంధించిన షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. సార‌ధి స్టూడియోలో ఆగుడు మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ మూవీను 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాలా జాగ్రత్తగా నిర్మిస్తుంది. ఓ ర‌కంగా చెప్పాలంటే వ‌న్ మూవీతో ఏడు కోట్ల రూపాయల‌ న‌ష్టంలో ఉన్న 14 రీల్స్, ఈ న‌ష్టాన్ని ఆగ‌డు మూవీతో లాభాలుగా మార్చుకోవాల‌ని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: