కామ‌సూత్ర హీరోయిన్ షెర్లిన్‌చోప్ర క్రిమిన‌ల్ కేసులో ఇరుక్కుంది. షెర్లిన్‌చోప్ర ఎప్పుడైతే కామ‌సుత్ర త్రిడి మూవీలో న‌టిస్తుందో, ఆనాటి నుండి నేటి వ‌ర‌కూ ఆ మూవీకు సంబంధించిన విష‌యంలో వివాదాస్పధంగా మారుతూ వ‌చ్చింది. మొద‌ట కామ‌సూత్ర మూవీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోషూట్‌ల‌ను సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్ లో పెట్టి, నిర్మాత‌ల ఆగ్ర‌హానికి గురైంది. అయితే త‌ను మాత్రం ఆ ఫోటోషూట్‌ల‌ను నేను పెట్టలేదు. అవి ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయో నాకు తెలియ‌దు అంటూ నిర్మాత‌ల మీద రివ‌ర్స్ అయింది. దీంతో విసుగు చెందిన నిర్మాత‌లు షెర్లిన్‌చోప్రను కామ‌సూత్ర 3డి మూవీ నుండి తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాని చివ‌రి నిముషంలో షెర్లిన్‌చోప్ర నిర్మాత‌ల వ‌ద్ద రాజీకు వ‌చ్చి, ఆ మూవీలో న‌టించింది. ఈసారి మూవీ షూటింగ్‌కు సంబంధించిన సీక్రెట్స్ ను, ఫొటోల‌ను బ‌య‌ట పెట్టి మ‌రోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ విష‌యాల‌ను నిర్మాత‌లు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. త్వర‌లో రిలీజ్ కాబోతున్న కామ‌సూత్ర 3డి మూవీకు ప‌బ్లిసిటిగా షెర్లిన్‌చోప్రను ఉప‌యోగించుకోవాల‌ని, అందులోని భాగంగానే హీరోయిన్‌పై క్రిమిన‌ల్ కేసును పెట్టారు. షెర్లిన్‌చోప్ర, కామ‌సూత్ర త్రిడి మూవీలోని కంటెంట్‌ను దుర్వినియోగం చేసిందంటూ ముంబై పోలిస్‌స్టేష‌న్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయ్యింది. అయితే అందుకు న‌ష్టప‌రిహారంగా షెర్లిన్‌చోప్ర నుండి ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌ను నిర్మాత‌లు అడుగుతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కేసు బిటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: