ఆ మ‌ధ్య టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న దైన హావాను కొన‌సాగించిన క‌మ‌లిని ముఖ‌ర్జీ, కొంత గ్యాప్ తీసుకుంది. 2011లో వ‌చ్చిన విరోధి మూవీ త‌రువాత క‌మ‌లిని ముఖర్జీ నుండి చెప్పుకోద‌గ్గ మూవీలు ఏవి రిలీజ్ కాలేదు. కాక‌పోతే నాగార్జున న‌టించిన భ‌క్తి చిత్రం షిరిడిసాయి మూవీలో మాత్రం ఓ పాత్ర వేసి అంద‌రిని అల‌రించింది. క‌మ‌లిని ప‌ని అయిపోయింది అనుకున్న త‌రుణంలో, క్రియోటివ్ డైరెక్టర్ ఈమెకు అదృష్టంగా మారి ఆఫ‌ర్‌ను ఇచ్చాడు. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న అప్‌క‌మింగ్ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ లో క‌మ‌లిని ముఖ‌ర్జీకు అవ‌కాశం వ‌చ్చింది. రామ్‌చ‌ర‌ణ్, శ్రీకాంత్ న‌టిస్తున్న ఈ మూవీలో సెకండ్ లీడింగ్ హీరోయిన్‌గా క‌మ‌లిని ముఖ‌ర్జీ ఆఫ‌ర్‌ను చేజిక్కించుకుంది. అయితే రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ రొమాన్స్ చేస్తుండ‌గా, శ్రీకాంత్ స‌ర‌స‌న క‌మ‌లిని రొమాన్స్ చేస్తుంది. శ్రీకాంత్‌తో క‌మ‌లినికు ఇది రెండో మూవీ. విరోధి మూవీలో వీరి కాంబినేష‌న్ బాగుంద‌నే టాక్ రావ‌డంతో కృష్ణవంశీ క‌మ‌లినికు ఓకె చెప్పాడు. అయితే క‌మ‌లినిను తీసుకోవ‌డానికి ఓ కార‌ణం ఉందంటా. శ్రీకాంత్‌,క‌మ‌లిముఖ‌ర్జీల మ‌ధ్య ఈ మూవీలో ఓ లిప్‌లాక్ సీన్ ఉంద‌ని, అందుకు ఒప్పుకున్నందుకే క్రియోటివ్ డైరెక్టర్ ఈ బ్యూటీను ఓకె చేశాడ‌ని టాలీవుడ్ అంటుంది. ఇక క్రియోటివ్ డైరెక్టర్ రేంజ్ ముద్దుసీన్స్ ఉన్నాయంటే అది ఏవిధంగా ఉంటుందో ఊహించుకుంటేనే మ‌రో మొగుడు మూవీలోని హాట్ సాంగ్ గుర్తుకు వ‌స్తుందంటున్నారు. క‌మ‌లిని, శ్రీకాంత్‌ల‌తో లిప్‌సీన్ ఏవిధంగా చేయిస్తాడో అంటే మూవీ రిలీజ్ వ‌రకు వెయిట్ చేయాల్సిందే మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: