మెగా ఫ్యామిలో వారసుల హవా కొనసాగుతుంది.. రేయ్ సినిమాతో చిరంజీవి మేనల్లుడైన సాయి ధరం తేజ్ ఎంట్రీ ఇస్తుంటే.. హీరో అండ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ నాగ బాబు కొడుకు వరున్ తేజ్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. తెరంగేట్రం మంచి సినిమాతో చేపించాలనే తెగ ప్రయత్నాలు చేశాడు నాగబాబు. చివరకు శ్రీకాంత్ అడ్డాలా డైరక్షన్లో పచ్చజెండా ఊపేశారు. ఇక శ్రీకాంత్ అడ్డాలా విషయానికొస్తే మొదటి సినిమా కొత్తబంగారు లోకంతో హిట్ కొట్టి సెకండ్ సినిమానే సూపర్ అండ్ క్రేజీ మల్టీస్టారర్ తో హిట్ కొట్టాడు. సినిమాని ఎంతో గొప్పగా ప్రేమించే శ్రీకాంత్ లాంటి డైరక్టర్ చేతిలో వరుణ్ తేజ్ ని పెట్టి మంచి పని చేశాడు నాగబాబు. ఇక ఈ సినిమా కి హీరోయిన్ ఎవరనేది కూడా చాలా రోజులనుండి డిస్కషన్ జరుగుతుంది.. ఫైనల్ గా కన్నడ భామ అక్షయ గౌడ్ ని ఓకే చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే కోళీవుడ్ లో.. బాలీవుడ్ లో అదుర్స్ అనిపించుకుంటున్న ఈ బెంగుళూరు భామ వరుణ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. సో తన కొడుకు భాద్యతను డైరక్టర్ మీద పెట్టిన నాగబాబు నమ్మకాన్ని శ్రీకాంత్ అడ్డాలా ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఇక వరుణ్ తో జోడీ కడుతున్న అక్షయ గౌడ్ కి ఈ సినిమా హిట్ అయ్యి ఇక్కడ కూడా మంచి మంచి ఆఫర్లు రావాలని కోరుకుందాం.టైటిల్ ఇంకా ఏమి పెట్టని ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మిగతా స్టార్ కాస్ట్ అంతా త్వరలో ఎనౌన్స్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: