సినిమా. . ఓ రంగుల ప్రపంచం అంటారు.. ప్రపంచంలో ఉన్న అందమైన లోకేషన్స్ కళ్ళు చెదిరిపోయే భారీ సెట్టింగ్స్ తో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తాయి. భాలీవుడ్ సినిమాలో చూస్తే ప్రపంచంలో ఉన్న వింతలు అందమైన లోకేషన్స్ తో ప్రపంచ పర్యటన చేసినంత ఆనందంగా వుంటుంది. ఆడియెన్స్ ని అబ్బురపరచే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్స్ ని ప్లాన్ చేస్తుంటారు దర్శ నిర్మాతలు.. ఒక సాధారణ ఆడియెన్ చూడలేని ఎంతో ప్రదేశాలను తమ సినిమాలో చూపిస్తుంటారు హీరోలు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన ఇండియన్ సినిమా యన మార్కేత్ ని పెంచుకుంది.. కేవలం ఇండియా లొకేషన్స్ లో నే కాకుండా కథ డిమ్మాండ్ చేస్తే ఎక్కడికైనా వెళ్తున్నారు దర్శకులు. బాలీవుడ్ లో ఎక్కువగా యు.ఎస్, యు.కే లో జర్మనీ లో అందమైన లొకేషన్స్ తో భారీ సెట్టింగ్స్ తో చాలా అందంగా.. ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా భారీ లొకేషన్స్ తో బాలీవుడ్ నిర్మాతలు తెరకెక్కిస్తూ వుంటారు. రీసెంట్ గా విడుదలైన దూమ్ 3 , క్రిష్ 3 వంటి సనిమాలను చూస్తే అర్దమవుతుంది వీరు లొకేషన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. . కధకు తగిన లొకేషన్ కావాలంటే ఖండాంతరాలు దాటడానికి కూడా రెడీగా ఉన్నారు. . వారి ఊహల్లో వచ్చిన ధాట్ ని కూడా నిజరూపం దాట్చడానికి ప్రపంచమంతా గాలిస్తారు. బాలీవుడ్ లో కొనసాగ్తున్న ఈ ట్రెండ్ ని సౌత్ సినిమాలు కూడా అందిపుచ్చుకున్నాయి.. హీరో ని ఫారిన్ రిటర్న్ గాయ్ గా.. లేదా హీరోయిన్ ఫారిన్ లో స్టడీస్ చేయడం కోసం ఫారిన్ లొకేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు టాలీవుడ్ కూడా దీన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ కి ధీటుగా లొకేషన్స్ వేటలో నిమగ్నమై ఉన్నారు.. ఎంతటి ఖరీదైన లోకేషన్స్ లోనైనా తీయడానకి టాలీవుడ్ నిర్మాతలు ముందుంటున్నరు. డైనమిక్ డైరెక్టర్ పూరీ తను తీసే ప్రతి సినిమాలో ఫారెన్ లొకేషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇంతకు ముందు తీసన దేవుడు చేసిన మనుషులు సినిమా అంతా ఫారెన్ లోకేషన్స్ నే వాడుకున్నాడు. ప్రస్తుతం నితిన్ తో తీస్తున్న హార్ట్ ఎటాక్ సినిమా కూడా అంతా స్పెయిన్ లోనే చిత్రీకరించడం జరిగింది. దీని ఆడియో పంక్షన్ కూడా బ్యాంకాక్ లో రిలీజ్ చేశాడు పూరి. ఇలా ప్రతి సినిమాలో అందమైన ఫారెన్ లోకేషన్స్ ను మన టాలీవుడ్ కు పరిచయం చేస్తుంటాడు. ఒక్కో డైరక్టర్ ఒక్కో లోకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.. వారి సినిమాలకు అనుగుణంగా ఎక్కడైతే బాగుంటుందో అక్కడ షూటింగ్ చేసుకొస్తున్నారు. మన టాలీవుడ్ పాట వస్తుందంటే అంతా అలా బయటకు వెళ్ళి దమ్ము కొట్టేసి వచ్చే వారు కానీ ఇప్పుడు పాట వస్తుందంటే ఎక్కడ లోకేషన్స్ మిస్ అవుతామో అన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా నిర్మాతలు లోకేషన్స్ ను ఎంచుకుంటున్నారు. శ్రీ రాఘవ లోకేషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు.. ఆ మద్య తీసిన యుగానికోక్కడు. . సినిమాలో విచిత్రమైన లోకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటి వరకు తీసిన సీనిమాల్లో అన్నింట్లో మనకు ఒక కొత్త లోకేషన్ ను పరియచం చేస్తుంటాడు. ఇక వర్ణ సినిమా కొస్తే ఆ లొకేషన్స్ కి తోడు గ్రాఫిక్స్ తోడే అదో రంగుల ప్రపంచంలా మన ముందుంచాడు డైరెక్టర్ శ్రీ రాఘవ . . ఈ వర్ణ మూవీని జార్జియాలో షూట్ చేశాడు.. ఇప్పటి వరకు ఏ సినిమాను అక్కడ షూట్ చేయలేదు.. కథ డిమాండ్ మేరకు వర్ణ సినిమాను జార్జియాలో షూట్ చేశాడు డేఇరక్టర్ శ్రీ రాఘవ.. సినిమా నిరాశ పరచినా లొకేషన్స్ చూసి ఆడియెన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కామెడీ కి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీను వైట్ల కూడా ఫారెన్ లొకేషన్ల మోజు ఎక్కువే .. . యన్ టీ ఆర్ జోడీగా తెరకెక్కించిన బాద్షా అంతా ఫారెన్ లొనే రూపుదిద్దుకుంది. దూకుడు సినిమాలో కూడా టర్కి ఇస్తాంబుల్ దాకా వెళ్లారు సూపర్ స్టార్ మహేష్.. శ్రీనువైట్ల.. దూకుడు సినిమాలో ఆ ఎపిసోడ్ ఎంతాగానో ఆడియెన్స్ ని అలరించింది. మన తెలుగు సినిమాలకు ఫారెన్ లొకేన్స్ అవసమంటారా లేక కదకు తగ్గ లోకేషన్స్ కొరకు ఫారెన్ వెల్తారా అంటే మన డైరెక్టర్లు.. ఈ కధకు ఈ లొకేషన్ అయితే రిచ్ గా వుంటుంది. అనుకొని మరీ ఫారెన్ లోకేషన్స్ ను ఎంచుకుంటున్నారు. అది కదకు అవసరం అయినా కాక పోయినా సినిమా ప్రేమ్ అందంగా చూపించగలిగితే ప్రేక్షకున్ని మెప్పించవచ్చు అనే భావన దర్శకుడిలో కలుగుతుంది.. అందుకే సీనుకు తగిన లొకేషన్స్ ఉన్నప్పటికీ ఇంకా అందంగా చూపించాలనే ఆశ తో ఖండాంతరాలను దా టి మరి వెళుతున్నారు.. సో మొత్తానికి ఫారిన్ అందాలను సరికొత్త లొకేషన్స్ ని సినిమా సినిమాకు డిఫరెంట్ గా మనకు చూపిస్తున్న దర్శ నిర్మాతలు.. హీరోలు.. కేవలం ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికే.. సో వారి కష్టాన్ని మనం కూడా కొంత భాద్యత వహిస్తూ ఆ లొకేషన్స్ చూపిస్తున్న సినిమాలను హిట్ చేసేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: