సూపర్ స్టార్ మహేష్ హీరోగా సైకలాజికల్ ట్రీట్ గా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన మూవీ 1 నేనొక్కడినే.ఈ సినిమా రిలీజ్ అప్పుడు కొద్దిగా బ్యాడ్ టాక్ వచ్చినా 2 వారలు గడిచేసరికి ఆడియెన్స్ సినిమాను అర్దం చేసుకుంటున్నారు. సుకుమార్..మహేష్ ..ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమా ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి స్టార్ డైరక్టర్లు సైతం స్పందించారు. వారిలో ముందుగా రాజమౌళి 1 సినిమా నచ్చి ఏకంగా సుకుమార్తో ఇంటర్వ్యూనే చేశాడు సినిమా గురించి. ఇక సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా ఈ సినిమా మాస్టర్ పీస్ కాదు పీస్ మాస్టర్ అని తన వే లో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక శ్రీను వైట్ల కూడా 1 ఒక అద్భుతమైన సినిమా అని అన్నాడు.. ఇక పోకిరితో మహేష్ కి తిరుగులేని స్టామినాను ఇచ్చిన పూరి కూడా ఈ సినిమా చూసి తన అభిప్రాయన్ని తెలిపాడు. సినిమా చాలా రిచ్ గా గొప్పాగా ఉందని.. కొత్త ప్రెజెంటేషన్ తో సూపర్ గా తీశారని చెప్పారు. మహేష్ ఎక్స్ లెంట్ పర్ఫార్మెన్స్ ని అందించాడని చెప్పాడు. సినిమా టాక్ బ్యాడ్ గా వచ్చినా మేటి దర్శకులంతా సూపర్ అనడంతో ఆడియెన్స్ కూడా ఆలోచించడం మొదలెట్టారు. ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రం ఎందుకు చూడలేదు..? చూసి తను కూడా ఓ మాట అనేస్తే పోలా అని సినీ విమర్శకులు అనుకుంటున్నారు. మహేష్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న త్రివిక్రం 1 సినిమా చూసి మహేష్ యాక్టింగ్ గురించి తన మాటల్లో చెప్తే బాగుండేది కద.. అని అందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా మహేష్ ఎక్స్ లెంట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పెద్ద హైలేట్.. సో ఈ సినిమా ముందుముందు ఇంకా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రశమ్షలు పొందాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: