కోలీవుడ్ యాక్టర్ వ‌నిత విజ‌య్‌కుమార్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈమె కోలీవుడ్ పాపుల‌ర్ యాక్టర్ మంజుల విజ‌య్‌కుమార్ కూతురు. ఈసారి కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు చెందిన ఓ కొరియోగ్రాఫ‌ర్‌ను వ‌నిత విజ‌య్‌కుమార్‌ పెళ్ళి చేసుకోబోతుంది. ఇప్పటికే వనిత విజ‌య్‌కుమార్‌కు రెండు సార్లు పెళ్ళిళ్లు జ‌రిగాయి. జ‌రిగిన రెండు పెళ్లిళ్లను అఫిషియ‌ల్‌గా చేసుకున్నాక‌, మ‌నస్పర్ధర‌ల‌తో విడిపోయారు. అయితే వనిత విజ‌య్‌కుమార్ త‌న మూడో పెళ్ళికు సంబంధించిన వార్తల‌పై క్లారిటి ఇచ్చింది. త‌న మూడో పెళ్ళిపై వ‌స్తున్న గాసిప్స్‌కు గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చింది. మీడియా అడిగిన ప్రశ్నకు వ‌నిత విజ‌య్‌కుమార్ ఈ విధంగా స‌మాధానం ఇచ్చింది. 'నాకు మూడో మ్యారేజ్ ఇప్పట్లో లేదు. కాని త్వరలోనే చేసుకుంటాను. కోరియోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేమిద్దరం ప్యామిలి ప్రెండ్స్‌. త‌న‌తోనే త్వర‌లో నాకు వెడ్డింగ్ ఫిక్స్ అవ్వబోతుంది. ఇందులో దాచుకోవ‌ల‌సింది ఏమి లేదు' అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ విధంగా వ‌నిత విజ‌య్‌కుమార్ మాట్లాటంతో కోలీవుడ్‌లో ఈ టాపిక్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే వ‌నిత విజ‌య్‌కుమార్ త‌న మెద‌టి పెళ్లిను త‌మిళ్ యాక్టర్ ఆకాష్‌తో చేసుకుంది. చేసుకున్న కొన్ని సంత్సరాల‌కే ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. త‌న పేరు శ్రీహ‌రి. మొద‌టి పెళ్లి త‌రువాత ఓ ఎన్.ఆర్‌.ఐ ను వ‌నిత విజ‌య్‌కుమార్ చేసుకుంది. ఇత‌నితోనూ కొంత కాలానికి వ‌డిపోయింది. అయితే ఈ ఇద్దరి మొగుళ్లతోనూ వ‌నిత విజ‌య్‌కుమార్ అఫిషియ‌ల్‌గా డివోర్స్‌ను తీసుకుంది. ఇప్పుడు మ‌రో కొద్ది కాలంలోనే మూడో పెళ్ళి సిద్ధప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: