ఆటోనగర్ సూర్య ఆడియో ఫంక్షన్ అంతంత మాత్రంగానే జరిగింది. ఫరవాలేదనిపించినప్పటికీ ..అందులో ఏదో తెలియని లోటు అభిమానులకు కొట్టొచ్చినట్టు కనిపించింది. అక్కినేని ఫ్యామిలీలో మెంబర్స్ దాదాపుగా ఈ ఫంక్షన్ కు రాలేదు. చైతూతో సన్నిహితంగా ఉండే రానా, సుశాంత్ లే వచ్చారు. నాగార్జున, అమల, సుమంత్ సహా మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. అక్కినేని నాగార్జున ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. రీసెంట్ గా నాగేశ్వర్ రావు ఆరోగ్యంపై ఆ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. ఐతే అభిమానుల్లో మాత్రం తెలియని ఆందోళన మొదలైంది. అక్కినేనికి ఆరోగ్యం బాగా ఉండి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యేవారని అనుకుంటున్నారు. గతంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ సినిమా ఆడియో ఫంక్షన్ వారి కుటుంబ సభ్యులతో కన్నులపండువగా ఉండేది. ఐతే ఈసారి ఆడియన్స్ ఆ ఫ్లేవర్ మిస్సయ్యారు. ఇక ఆడియో ఫంక్షన్ లో హీరో నాగచైతన్య హావభావాలు కూడా ఆర్టిఫిషియల్ గానే కనిపించాయంటున్నారు ఆడియన్స్... నవ్వాలి కాబట్టి నవ్వారు....మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు అనుకునేలా ఉన్నాయి ఆడియో ఫంక్షన్ హైలైట్స్... ఆడియో ఫంక్షన్ తప్పనిసరి కనుకనే చేసినట్టున్నారు కానీ, లేదంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఉండేవారని తెలుస్తోంది. ఏదైతేనేం అక్కినేని ఫ్యామిలీ గురించి ...నాగేశ్వర్ రావు ఆరోగ్యం గురించి ఆడియన్స్ ఆరాటపడుతున్నారన్నది మాత్రం నిజం...

మరింత సమాచారం తెలుసుకోండి: