పొలిటిక‌ల్ థ్రిల్లర్ మూవీగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ బ‌డా మూవీ జ‌య‌హో. స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన జ‌య‌హో మూవీ జ‌న‌వ‌రి 24న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తెలుగులో వ‌చ్చిన స్టాలిన్ మూవీకు ఇది రిమేక్ మూవీగా బాలీవుడ్‌లో తెర‌కెక్కింది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావ‌డంతో స‌ల్మాన్‌ఖాన్ నటించిన జ‌య‌హో మూవీపై విప‌రీత‌మైన క్రేజ్ ఏర్పడింది. అయితే జ‌య‌హో మూవీకు సంబంధించిన సెన్సార్ విష‌యంలో స‌ల్మాన్‌ఖాన్‌కు బ్యాడ్ న్యూస్ వినిపించింది. జ‌య‌హో మూవీను సెన్సార్ బోర్డుకు పంపించ‌గా, ఆ మూవీన చూసిన వాళ్ళు దానికి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్‌ను చూసి చిత్రయూనిట్ అవాక్కయింది. కార‌ణం ఏంట‌ని అడిగితే సెన్సార్ వాళ్ళు ఈ విధంగా చెప్పారు. 'జ‌య‌హో అనే పొలిటిక‌ల్ థ్రిల్లర్ మూవీలో బూతు ప‌ద‌జాలం, క‌రెప్షన్ గురించిన హింస‌, విప‌త‌రీమై ఫైట్స్ ఎక్కువుగా ఉండ‌టంతో U/A స‌ర్టిఫికేట్ త‌ప్పని స‌రి అయింద‌న్నారు'. ఈ స‌ర్టిఫికేట్ సల్మాన్‌ఖాన్ ఫ్యాన్స్‌ను బాధ క‌లిగించింద‌ట‌. ఎందుకంటే స‌ల్మాన్‌ఖాన్ మూవీలంటే ఎక్కువుగా U స‌ర్టిఫికేట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలాంటిది పొలిటిక‌ల్ థ్రిల్లర్ మూవీ అయిన జ‌య‌హోకు U/A స‌ర్టిఫికేట్ అంటే స‌ల్మాన్‌ఖాన్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అని బాలీవుడ్ అంటుంది. జ‌య‌హో మూవీలో హింస ఎక్కువుగా ఉంద‌నే టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో మూవీ ప్రమోష‌న్‌తో పాజిటివ్ టాక్ తెప్పించాల‌ని చిత్ర యూనిట్ ప్లానింగ్స్ వేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: