రుద్రమదేవి, బాహుబలి చిత్రాల మాదిరి యాక్షన్ యాంగిల్‌ కాకుండా ఓ కొత్త సినిమాలో అనుష్క న‌టిస్తుంది. అందుకే, ఫిలిమ్ నగర్ లో ఇది హాట్‍ న్యూస్ గా మారింది. బొమ్మాళి బ్యూటీ కొత్త సినిమా ఒప్పుకుంది. ప్రస్తుతం తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. వీటి కారణంగా మరో రెండేళ్ల వరకు అనుష్క కొత్త సినిమా ఒప్పుకోదని అంతా అనుకున్నారు. కానీ, తన అభిమానులను హ్యాపీ చేస్తూ అనుష్క అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్‍లోనూ కొత్త సినిమాలకు సంతకాలు చేయడం ప్రారంభించింది. అనుష్క తెలుగు చిత్రాల విషయానికొస్తే, పిల్లజమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో ‘భాగమతి’ చిత్రంలో నటించేందుకు ఇటీవలే గ్రీన్‍ సిగ్నల్‌ ఇచ్చింది. తన ‘భాగమతి’ పాత్రకు అనుష్క తప్ప మరెవరూ సరితూగరని దర్శకుడు ఫిక్సైపోయి ఈ యోగా సుందరి కోసం 6 నెలలు వెయిట్ చేశాడు. అలా వెయిట్ చేయించి ఇటీవలే ఎస్ చెప్పడంతో అశోక్ తన భాగమతి ప్రీ ప్రొడక్షన్‍ పనుల్ని ప్రారంభించుకున్నాడు. తెలుగు సినిమాల విషయం ఇలా ఉంటే, లేటెస్ట్‌గా దర్శకుడు గౌతమ్‍మీనన్ సినిమాలో నటించే అవకాశాన్ని అనుష్క చేజిక్కించుకుంది. హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో గౌతమ్ సిద్ధహస్తుడు కాబట్టి బొమ్మాళి భామను సెక్సీగా చూసేయొచ్చని ఆమె ఫ్యాన్స్ ఇప్పటి నుండి ఎగ్జయిట్‍మెంట్‍ చూపించేస్తున్నారు. మొత్తానికి, సరిగ్గా ఏడాది క్రితం అనుష్క పని ఐపోయిందని అంతా కామెంట్లు చేశారు. పెళ్లి చేసుకొని సైడ్ అవ్వాలంటూ ఉచిత సలహాలు పాడేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏదేమైనా, తనలో మునుపటి కళ లేదని ఎగతాళి చేసినవాళ్లకు గుణపాఠంగా ఈ యోగా టీచర్‍ మళ్లీ వరుస చిత్రాల్ని ఒప్పుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: