బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌గా కొన‌సాగుతున్న హీరోయిన్స్ క‌రీనాక‌పూర్‌, క‌త్రినాకైఫ్‌. క‌త్రినాకైఫ్ అంటే క‌రీనాక‌పూర్‌కి ప‌డ‌దు.అలాగే క‌రీనా క‌పూర్ అంటే క‌త్రినాకైఫ్‌కి సైతం ప‌డ‌దు. వీళ్ళిద్దకూ ఒకే బాయ్ ప్రెండ్‌తో ఎఫైర్‌ను రెండు సంవ‌త్సరాల పాటు చేశారు. అలాగే ఒక‌రికొక‌రు ప‌బ్లిక్‌గ్గానే కామెంట్స్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క‌రీనాక‌పూర్‌, క‌త్రినాకైఫ్‌ల‌పై ఎప్పుడూ హాట్ టాపిక్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే క‌రీనాక‌పూర్ ఎప్పుడైతే సైఫ్‌ను పెళ్లి చేసుకుందో అప్పటి నుండి వీరిద్దరి మ‌ధ్య గాసిప్స్ త‌గ్గుముఖం ప‌ట్టాయి. చాలా కాలం త‌రువాత మ‌ళ్ళీ క‌రీనాక‌పూర్‌, కత్రినాకైఫ్‌ల మ‌ధ్య గొడ‌వ స్టార్ట్ కాబోతుంది. ఏక్తా టైగ‌ర్ డైరెక్టర్ క‌భీర్‌ఖాన్ డైరెక్షన్‌లో సైఫ్ అలీ ఖాన్‌, క‌త్రినాకైఫ్ జంట‌గా న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా సైఫ్ అలీ ఖాన్‌, క‌త్రినాకైఫ్‌తో ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన‌ట్టు బి టౌన్ మీడియా చెబుతుంది. బిటౌన్ మీడియా క‌థ‌నం ప్రకారం సైఫ్‌, క‌త్రినా ఇద్దరూ డిన్నర్ చేస్తున్న స‌మ‌యంలో క‌త్రినాతో చాలా క్లోజ్‌గా సైఫ్ ప్రవ‌ర్తించాడ‌ని, ప‌బ్లిక్‌లో ఉన్నామా అనే విష‌యాన్ని మ‌ర్చిపోయి మ‌రీ ఆ డిన్నర్‌ను ఎంజాయ్ చేసిన‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విష‌యం క‌రీనాక‌పూర్‌కి లేటుగా తెలిసింది. క‌త్రినాకైఫ్‌తో ప్రవేట్‌గా డిన్నర్ చేసినందుకు భ‌ర్త సైఫ్ అలీ ఖాన్‌పై క‌రీనాక‌పూర్ మండిప‌డుతుంద‌ట‌. క‌త్రినాతో చేస్తున్న మూవీ షెడ్యూల్స్‌కు సంబంధించిన టైమింగ్స్‌ను ఆ మూవీ డైరెక్టర్ క‌భీర్‌ఖాన్ నుండి అడిగి తెప్పించుకుంద‌ట‌. మూవీ షూటింగ్ త‌రువాత సైఫ్, త‌న‌తోనే ఉండాల‌ని క‌రీనాక‌పూర్ కండిష‌న్స్ పెట్టిన‌ట్టు బిటౌన్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: