కేంద్ర మంత్రి చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ వారి స్థాయిలు మరిచపోయి ఒకే చోట కలుసుకోవడమే కాదు కాలేజీ స్టూడెంట్స్ లా ఒకరి ఫై ఒకరు జోక్స్ వేసుకుంటూ కేరింతలు కొడుతూ వీరు సెలిబ్రిటీలు అనే విషయం కొంతసేపు మర్చిపోయి నానా హడావిడి చేశారు. అది చెన్నైలోని ఇంజంబ్బాకం ఈస్టుకోస్ట్‌లోని మోహన్‌లాల్ గెస్ట్ హౌస్ చీకటి ముసురుకునే వేళ ఆకాశంలోంచి తారలు ఊడిపడ్డట్టుగా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన ఈ అగ్రతారలంతా ఒక్కమారుగా అక్కడికి చేరుకున్నారు. కరచాలనాలు, కౌగిలింతలు, బోలెడన్ని కబుర్లు, తీపిగుర్తులతో అందరూ మంచి మూడ్ లోకి వెళ్లిపోయారు. గత నాలుగేళ్ల నుంచీ బ్రేక్ లేకుండా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ స్టార్స్ గెట్ టు గెదర్ జరగడం విశేషం. అసలీ గెట్ టు గెదర్‌కి శ్రీకారం 2009లో  ఆరంభమైం,ది ఈ ‘ఎయిటీస్ రీ యూనియన్ క్లబ్’. మొదటి రెండేళ్లు తారలందరూ కలసి, చెన్నయ్‌లో పండగ చేసుకున్నారు. మూడో సంవత్సరం మాత్రం హైదరాబాద్‌లో చిరంజీవి ఇంట్లో కలుసుకున్నారు. ఆ మరుసటి ఏడాది బెంగళూరులో అంబరీష్, సుమలతల ఆతిథ్యం అందుకున్నారు. ఈ నెల 18న మోహన్‌లాల్ ఇంట్లో ఈ తారల కలయిక జరిగింది.  మేజిక్, డాన్స్, జోక్స్ అంటూ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఖుష్బూ, జయశ్రీ ఓ క్విజ్ షో నిర్వహించగా, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్ సరైన సమాధానాలు చెప్పి, బహుమతులు పొందారు. ఈ పార్టీలో పాల్గొన్న వారు మోహన్‌లాల్‌కు బహుమతులిచ్చారు. రంగు రంగుల పూలదండలు మెడలో వేసుకుని అందరూ సందడి చేశారు. అందరూ కలిసి ఫొటోలు దిగారు. వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నారు. మరో ఏడాది వరకు ఈ మధురానుభూతులను నెమరు వేసుకుంటామని కొంతమంది తారలు తమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మీటింగ్ ప్లేస్ ఎక్కడ? అనేది తెలియాల్సి ఉంది.  ఇంతకి ఈ వేడుకలో పాల్గొన్న తారల్లో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అర్జున్, సుమన్, సీనియర్ నరేష్, భానుచందర్, అంబరీష్, మోహన్‌లాల్, జయరామ్, రమేష్ అరవింద్, సుహాసిని, రాధిక, సరిత, సుమలత, లిజి, రాధ, అంబికా, నదియా, రేవతి, ఖుష్బూ, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ లాంటి సూపర్ సెలిబ్రిటీలు ఉండటం కోలీవుడ్, టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: