అంచనాలకు మించి ‘ఎవడు’ విజయవంతం అవడంతో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న కృష్ణవంశీ మల్టీ స్టారర్ ప్రారంభానికి రంగం సిద్దం అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్వచ్చమైన తెలుగు సినిమా టైటిల్స్ కు క్రేజ్ ఏర్పడడంతో ఈ సినిమాకు 'గోవిందుడు అందరివాడేలే' అనే టైటిల్ కృష్ణవంశీ నిర్ణయం చేసినట్లుగా తెలుస్తోంది.  ఈ టైటిల్ వెనుక రెండు అర్ధాలు ఉన్నాయి అని అంటున్నారు. చెర్రీ తండ్రి చిరంజీవి గతంలో నటించిన ‘అందరివాడు’ సినిమాలో హీరో పాత్ర పేరు గోవిందు. అదేవిధంగా జినియర్ నటించిన ‘బృందావనం’ సినిమా ట్యాగ్ లైన్ ‘గోవిందుడు అందరి వాడే’ ఇలా అటు చిరంజీవి, ఇటు జూనియర్ సినిమాలను గుర్తుకు చేసే విధంగా ఒక అచ్చమైన తెలుగు టైటిల్ తో ఈ సినిమా పట్టాలు ఎక్కిస్తున్నారు.  ఇప్పటి వరకూ చిరంజీవి పాటలను తన సినిమాలకు రీమిక్స్ చేసే అలవాటు పడ్డ చెర్రీ జూనియర్ సినిమాల ట్యాగ్ లైన్ ను కూడా తన టైటిల్స్ గా వాడుకోవడం ఒక సంచలనం అనే చెప్పాలి. ‘ఎవడు’ సినిమా సూపర్ హిట్ కావడంతో కృష్ణవంశీ, బండ్ల గణేష్ లు మంచి జోష్ తో ఈ సినిమాకు శ్రీకారం చుడుతున్నారు అని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: