తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమని ప్రచారం జరగడమే కాకుండా టాలీవుడ్ రికార్డులను తిరగ రాస్తుంది అని అనేక ఊహలతో విడుదల అయిన ‘1 నేనొక్కడినే’ అంచనాలకు మించి నష్టాల బాట పయనిస్తోంది అనే న్యూస్ టాలీవుడ్ వ్యాపార వర్గాలలో షాకింగ్ న్యూస్ లా మారింది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 25 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టుకోగలిగింది అని అంటున్నారు.  ఇక ఈ సినిమా రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి టాక్‌ మెరుగు పడుతోంది అనేది కేవలం టాక్‌గానే మిగిలిపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. మహేష్‌కి అత్యంత స్ట్రాంగ్‌ ఏరియా అయిన నైజాంలో కూడా ఈ చిత్రం తిరస్కారానికి గురవడం మహేష్ అభిమానులు తట్టుకోలేని నిజం అని అంటున్నారు. మొదటి వారంలో ఏడు కోట్ల షేర్‌తో సరిపెట్టిన ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో పది కోట్ల మార్కు చేరుకోవడం అసాధ్యమనిపిస్తోంది అని ట్రేడ్ పండితుల విశ్లేషణ.  ఇక సీడెడ్‌, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అయితే ఈ సినిమా అవుట్‌రైట్‌ డిజాస్టర్‌ గా రికార్డు క్రియేట్ చేస్తోంది. అయితే ఓవర్సీస్‌ వరకు స్వల్ప నష్టాలతో బయటపడుతుంది అని అంటున్నారు. ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు మహేష్ ‘వన్’ మరిచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చిందని టాక్  ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈ సినిమాను అంతర్జాతీఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపేందుకు వీలుగా ఈ సినిమాలోని పాటలు తొలిగించి,ట్రిమ్ చేసిన వెర్షన్ ని రెడీ చేస్తున్నారని టాక్. దీనికి కారణం ఈ సినిమాలో మహేష్ చేసిన నటనకు ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డు వచ్చి తీరుతుందని ఈ సినిమా దర్శక, నిర్మాతల నమ్మకం.   

మరింత సమాచారం తెలుసుకోండి: