రామ్‌చ‌ర‌ణ్ న‌టించే మూవీల టైటిల్స్ చాలా డిప్రెంట్‌గా ఉంటాయి. ఇప్పటి వ‌ర‌కూ త‌ను నటించిన మూవీల పేర్లు చూస్తే ఆ విష‌యం తెలుస్తుంది. ఇదిలా ఉంటే రామ్‌చ‌ర‌ణ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ కృష్ణవంశీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతుంది. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవ‌రి 6 నుండి సెట్స్‌మీద కు వెళుతుంది.కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న ఈ మూవీపై టాలీవుడ్‌లోనూ విప‌రీత‌మైన ఆస‌క్తి ఏర్పడింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. అలాగే శ్రీకాంత్ కూడ ఈ మూవీలో న‌టిస్తున్నాడు. శ్రీకాంత్ స‌ర‌స‌న క‌మ‌లినిముఖ‌ర్జీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీకాంత్ గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి మూవీల‌లో న‌టించాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ మూవీలో న‌టిస్తున్నాడు. దీంతో వీరి కాంబినేష‌న్ స‌క్సెస్ కాంబినేష‌న్‌గా మారుతుంద‌ని టాలీవుడ్ అంటుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకు టైటిల్‌ను కృష్ణవంశీ అనౌన్స్ చేశాడు. 'గోవిందుడు అంద‌రివాడేలే' అనే టైటిల్ రామ్‌చ‌ర‌ణ్ మూవీకు పెట్టేశాడు. అయితే ఈ టైటిల్‌ను గ‌మ‌నిస్తే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించి బృందావ‌నం మూవీకు 'గోవిందుడు అందిరివాడేలే' అనేది టాగ్ లైన్‌గా ఉంది. ఆ ట్యాగ్ టైన్‌ను కృష్ణవంశీ ఎత్తేసి, చ‌ర‌ణ్ మూవీకు మెయిన్ టైటిల్‌గా పెట్టేశాడు. ఈ టైటిల్‌పై చ‌ర‌ణ్ అంత ఆస‌క్తిగా లేడ‌ని టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. మొత్తానికి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన మూవీ టైటిల్‌లోని ట్యాగ్‌లైన్‌ను మొద‌టి సారిగా ఉప‌యోగించుకున్నది మెగాహీరో రామ్‌చ‌ర‌ణ్ మాత్రమే అని అంటున్నారు. ఈ మూవీకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ న్యూస్‌ను త్వర‌లోనే 'ఎపిహెరార్డ్ డాట్ కం' మీ ముందుకు తీసుకువ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: