బాలీవుడ్ లో ఎక్కువుగా మనీ సంపాదించేది ఎవరు అన్నదానిపై ఓ సర్వే జరిగింది. సర్వే చెప్పిని విషయాలను తెలుసుకొని బాలీవుడ్ అంతా అవాక్కయ్యారు. ఆ స‌ర్వేకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్‌ను 'ఏపిహెరాల్డ్ డాట్ కాం' మీకు అందిస్తుంది. బాలీవుడ్ లోని ధనవంతుల డబ్బును సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ ఇద్దరూ పిండేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని టచ్ చేసిని బ్యాంక్ బాలెన్స్ ఖాలీ అయిపోతుందంటున్నారు బాలీవుడ్ ట్రేడ్స్. ఇల్లు ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కత్రినా ఉంటే, నా రూటే సపరేటు అంటూ దూసుకు పోతున్నాడు స‌ల్మాన్ ఖాన్‌. రీసెంట్‍గా ఓ మెట్రోపాలిటన్ మ్యాగ్జైన్ కు కత్రినా ఫోజ్‍ ఇచ్చింది. ఇచ్చింది ఒకే ఒక్క ఫోజ్‍. మ్యాగ్జైన్ కవర్ పేజీకు కత్రినా అయితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందని ఆ మ్యాగ్జైన్ మేనేజ్‍మెంట్ భావించిందట. సరే అని కత్రినాను అప్రోచ్ అయితే ఒక్క ఫోజ్‍ కోసం ఇరవైఅయిదు లక్షల రూపాయలను వసూల్‌ చేసింది. కత్రినా కత్తిలాంటి హీరోయిన్‌ కావడంతో ఈ మాత్రం రేటు ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ అంటోంది. మరీ అంతంగా పబ్లిసిటీ కావాలంటే తక్కువలో వచ్చే పింక్ బ్యూటి సన్నీలియోన్, వీనామాలిక్ ను పెట్టుకోక కత్రినా జోలికి ఎందుకు వెళ్ళి బ్యాలెన్స్‌ను తగ్గించుకుంటారు అంటూ ఆ మ్యాగ్జైన్ కు కొంతమంది సలహాలను ఇస్తున్నారు. కత్రినాను పక్కన పెడితే స‌ల్మాన్ ఖాన్‌ ఏమాత్రం తక్కువేం కాదు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏం చేసినా అదో ట్రెండ్ సెట్‍ అవడంతో సల్మాన్ కోసం ఎంతైన ఖర్చు చేయటడానికి, మనీ పే చేయడానికి రడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: