కృష్ణవంశీ డైరక్షన్ లో రాం చరణ్ సినిమా చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకి టైటిల్ ని గోవిందుడు అందరివాడే అని పెట్టబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ టైటిల్ తో సినిమా పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్ వచ్చేలా చేసాయి. టైల్టిల్ ఇదే అని కంఫర్మ్ కాకపోయినా టైటిల్ మాత్రం కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా గుర్తుకువస్తుంది. మురారి సినిమాలో మహేష్ ని అద్నుతంగా చూపించి సూపర్ హిట్ కొట్టాడు కృష్ణ వంశీ.. సూపర్ క్లాసికల్ ఫిల్మ్ గా చ్రిత్రాల్లో నిలిచిపోయే విధంగా మురారి సినిమాను తీశాడు కృష్ణ వంశీ. డిఫరెంట్ సబ్జెక్ట్ తో అండ్ వెరైటీ టేకింగ్ తో మంచి కుటుంబ కథా చిత్రంగా ఆ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. మరి ఇప్పటి వరకు మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేసిన చరణ్ ఈ సినిమాతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని ఆలోచించే కృష్ణ వంశీ డైరక్షన్ లో చేస్తున్నాడని టాక్. ఏది ఏమైనా మురారి లాంటి మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కృష్ణ వంశీ డైరక్షన్లో వస్తే చూడడానికి ఆడియెన్స్ రెడీ గా ఉన్నారు. ఇక ఈ సినిమాతో చరణ్ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ అభిమానం సంపాదించడానికి చేస్తున్నాడు కావొచ్చు ఎందుకంటే సినిమా టైటిల్ అంత సాఫ్ట్ గా పెట్టారు కాబట్టి. సో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు వచ్చేది సాఫ్ట్ గోవిందుడో కాదోనని.

మరింత సమాచారం తెలుసుకోండి: