బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక పదుకునే తన బాయ్ ఫ్రెండ్స్ ను సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ మార్చేసినంత సులువుగా మార్చేస్తూ ఉంటుందని ఈ బ్యూటీ పై బాలీవుడ్ లో సెటైర్లు పడుతూ ఉంటాయి. గత సంవత్సరం దీపికా చేసిన ప్రతి సినిమా వందల కోట్లను కొల్లగొట్టడంతో దీపిక బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీపిక రణవీర్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మధ్యనే ఈ హీరో తన ప్రేయసి కోసం పది కోట్ల విలువ చేసే ఖరీదైన బహుమతి దీపికకు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చి బాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారాడు. ఈ మధ్య రణవీర్ దీపిక తో నటించిన ‘రామ్ లీలా’ సినిమా విజయంతో వీరిద్దరి పేర్లు బాలీవుడ్ మీడియాలో మారుమ్రోగి పోతున్నాయి. ఈమధ్య వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై వార్తలు తెగ రావడంతో దీపిక కలగచేసుకుని తాను అందరితో ఒకేలా ఉంటాను అదేవిధంగా రణవీర్ తో కూడా అలానే ఉన్నానంటూ మీడియాకు చెప్పుకొచ్చింది అయితే బహిరంగంగానే వీరిద్దరి మధ్య ముద్దులు సీన్స్ చూసిన వారు వేరే రకంగా అనుకున్నారు. అది వేరే విషయం ఈ నేపధ్యంలో తాజాగా వీరిద్దరిపై మరోవార్త బయటకొచ్చింది. దీపిక ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళిన రణవీర్ దీపిక పదుకొనె తో ఆమె 'కార్ వాన్'లో గంట సేపు ఏకాంతంగా గడిపారని టాక్. ఈ విషయాన్ని దీపిక ప్రస్తుతం నటిస్తున్న సినిమా యూనిట్ వారు కూడా అంగీకరించడంతో ప్రస్తుతం బాలీవుడ్ మీడియాకు ఈ వార్త హాట్ న్యూస్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: