ఒకప్పడు యువతను ఉర్రూతలూగించిన తారలు ఇప్పుడు.. మళ్ళీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.. ఈ మద్య అతిలోక సుందరి శ్రీదేవి, మాదురీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. తమ అభిమాన హీరోయిన్స్ ఎంట్రీతో తమ అబిమానులు పండగ చేసుకున్నారు. ఈ బాటనే ఇతర హాట్ బ్యూటీలు ఫాలో అవుతున్నారు..శ్రీ దేవి రెండు దశాబ్దాల పాటు యువతను మైమరిపించిన కలల రాణీ పెళ్ళయ్యాక చాలా రోజుల గ్యాప్ తరువాత ఇంగ్లీష్ వింగ్లీస్ తో తన సెకెండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి తమ అభిమానుల హృదయాలను కొల్లగోట్టింది..ఇంత గ్యాప్ వచ్చినా ఇప్పటికి నేటి హీరోయిన్ లకు ధీటుగా తన సత్తా చాటుకుంది. తమ అబిమానుల గుండెల్లో స్థిర స్తాయిగా నిలిచిపోయింది. దేడ్ ఇష్కియా తో మాదురీ ఎంట్రీ తో తాను ఏం తక్కవ కాదు అని నిరూపించుకుంది. ఇలా ఒకప్పుడు సినీ ప్రపంచ ఏలిన అప్సరసలంతా ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుండంతో అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోతుంది. వీరి బాటలోనే మరో సుందరి టబూ కూడా వీరితో పొటీ పడేందుకు రెడీ అవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అందరి అభిమానుల్లో స్థానం సంపాదించుకున్న టాబు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది.. తెలుగులో కెరియర్ స్టార్ట్ చేసి బాలీవుడ్ దాకా వెళ్లిన ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సకెస్ అవ్వాలని కోరుకుందాం. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చాలా మంది హీరోయిన్ల ఫెయిల్ అయిన అవకాశాలే ఎక్కువ. ఒకప్పుడు నెంబర్‌ వన్ స్థానంలో ఉన్న మాధురి దీక్షిత్ ఓ బాలీవుడ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకాదరణ దక్కలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు రీ ఎంట్రీ రెడీ అవుతున్న భామలు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: