తెలుగు..తమిళ సినిమాలతో ఆడియెన్స్ ని ఒక ఊపు ఊపిన అందమైన హీరోయిన్ సిమ్రన్. చాలా రోజుల తర్వాత మరళ రీ ఎంట్రీ ఇచ్చింది.. ఈ బ్యూటీ ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్ మొట్ట మొదటిసారి సౌత్ లో రీమేక్ చేస్తున్న ఆహా కళ్యాణం సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాను తెలుగు ..తమిళ్ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తీస్తున్నారు. ఈ సినిమా ఆడీయో రిలీజ్ రీసెంట్ గా చెన్నై లో జరిగింది. సిమ్రన్ తన అనుభావాలు చెబుతూ యష్ రాజ్ ఫిలింస్ వారితో నేను హీరోయిన్ గా చేసి ఉంటే బాగుండేది..ఇపాటికైనా యష్ రాజ్ వారు సౌత్ లో చేస్తున్న మొదటి సినిమాలో నేను నటించడం హ్యాపీగా ఉందన్నారు. నాని..వాణి కపూర్ హీరో..హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు డైరక్టర్ గోకుల్ .అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ అవ్వనుంది. సో మొత్తానికి పోయిన వయసు తిరిగి రాదు కనుక సిమ్రన్ కోరిక ఇలా అయినా నెరవేరిందని చెప్పొచ్చు. అయినా బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న నిర్మాణ సంస్థ గురించి సిమ్రన్ ఇలా మట్లాడటం చూస్తుంటే ఆ ప్రొడక్షన్ హౌజ్ స్టామినాను మనం గుర్తించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: