హీరోలకు సెంటిమెంట్లు ఎక్కువని కొత్తగా ఏం చెప్పనవసరం లేదు. వారి వారి సెంటిమెంట్లను డైరక్టర్స్..ప్రొడ్యూసర్స్ కూడా ఫాలో అయ్యేలా చేస్తారు. బాలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ తీస్తూ.. ఎన్నో ప్రయోగాలు చేస్తూ సూపర్ స్టార్ అనిపించుకునే హీరో అమీర్ ఖాన్. అమీర్ సినిమా ఆలోచనత్మకంగా ఉంటుంది.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.. బాలీవుడ్ లో డిఫరెంట్ ఇమేజ్ ఉన్న ఈ హీరో ఒక సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని తన మాటల్లోనే చెప్పాడు. 2007 నుండి అమీర్ ఓ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడట తను చేసిన తారే జమీన్ పర్..ఆ తర్వాత వచ్చిన 3 ఇడియట్స్ ఇలా న్యూ ఇయర్ కి వచ్చే క్రిస్ మస్ పండుగ రోజు తన సినిమాలు రిలీజ్ అయితే సూపర్ హిట్ సాదిస్తాయట. వచ్చిన రిజల్ట్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తారే జమీన్ పర్ సినిమా 2007 లో క్రిస్ మస్ కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఓ పిల్లాడిని పెట్టి అమీర్ చేసిన ప్రయోగం అద్భుతంగా అనిపించింది ఆడియెన్స్ కి. ఇక 2009 లో క్రిస్ మస్ కి రెండు రోజులు ముందు రిలీజ్ అయ్యింది 3 ఇడియట్స్.. ఆ సినిమా కూడా భారి కలెక్షన్స్ సాదించి అప్పటివరకు ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని షేక్ చేసింది. ఇక అదే సెంటిమెంట్ తో లాస్ట్ ఇయర్ డిశెంబర్ కి 5 రోజులు ముందు వచ్చింది ధూం 3 .. ధూం సీరీస్ కి సీక్వెల్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టి ఒక రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. దాదాపు 500 క్రోర్స్ మార్కెట్ ప్రైజ్ ని టచ్ చేసిందని బీ టౌన్ సమాచారం. మరి ఇలా చూస్తే అమీర్ తన ప్రతి సినిమా క్రిస్ మస్ సీజన్ లో నే రిలీజ్ ప్లాన్ చేయొచ్చు అనుకుంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాలు. సో ఏది ఏమైనా అమీర్ రికార్డ్స్ బద్దలు కొడితే ఒక ఆడియెన్ గా అది సూపర్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: