నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూసి మహేష్ అభిమానులు ఖంగారు పడిపోతున్నారు. ఇప్పటికే ‘1’ పరాజయంతో షాక్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు మణిరత్నం సినిమాకు సంభందించి వస్తున్న లేటెస్ట్ వార్తలను విని మహేష్ అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. గతంలో మహేష్ బాబుతో అనుష్క నటిస్తేనే అంటీలా ఉందని కామెంట్ చేసిన ప్రిన్స్ అభిమానులు ఇక ఏకంగా ఆంటీ అయిన ఐశ్వర్య రాయ్ ను తీసుకొచ్చి మహేష్ బాబు పక్కన పెడితే ఎలా చూసేది అంటు గగ్గోలు పెడుతున్నారు.  దీనికి కారణం మణిరత్నం సినిమాలో ఒకనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మహేష్ ప్రక్కన నటించడానికి ఎంపిక అయింది అనే వార్తలు రావడం, ఒకప్పటి మాజీ మిస్ ఇండియా అందాల తార అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య త్వరలోనే మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడం ఖాయం అంటూ బాలీవుడ్ లో చాలాకాలం నుంచి ఈ వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నా దర్శకుడు మణిరత్నం ఎలాగైనా ఐష్ ను తన సినిమాలో నటింపజేయాలని అనుకోవడమే కాకుండా నాగార్జున, మహేష్ ల మల్టీ స్టారర్ లో ఐశ్వర్య రాయ్ ఎంట్రీకి రంగం సిద్దం అయింది అనే వార్తలు ఊపు అందుకున్నాయి  ఐష్ తోలి సినిమా మణిరత్నం దర్శకత్వంలోనే రాగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మణి దర్శకత్వంలోనే రావడం పెద్ద విశేషమేమీ కాదు. కాగా నాగ్-మహేష్ మల్టీస్టారర్ సినిమాలో ఐష్ ఎవరికి జోడిగా నటిస్తుంది అనే విషయం పై క్లారిటీ లేకపోవడంతో మహేష్ అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయ  ఇంతకీ మహేష్ పక్కన ఐశ్వర్య నటిస్తే ఎలా ఉంటుంది? ఇది మరో ప్రయోగానికి దారితీస్తుందా? అనే విషయాల పై మీ ప్రతిస్పందన తెలియచేయండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: