పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ సెట్స్‌పైకి రావడానికి మళ్ళీ మరో ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మీ అభిమాన ఎ.పి. హెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా మరోసారి వెనకడుగు వేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లుగా ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ వచ్చి దాదాపు 110 రోజులు గడిచినా ఇప్పటివరకు పవన్ కు సంబంధించి ఏ సినిమా ప్రారంభం కాకపోవడానికి ఈ సినిమమే కారణం.  పవన్ కాల్ షీడ్స్ ఇస్తే చాలు కోట్లు గుమ్మరిస్తామని నిర్మాతలు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నా పవన్ తన ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ పూర్తి అయ్యేవరకూ మరో సినిమా జోలికి వెళ్ళను అని చెప్పడంతో ఈ సినిమా ఎప్పుడ పూర్తి అవుతుందా అని అనేకమంది నిర్మాతలు రోజులు లెక్కపెడుతూ పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్-సంపత్‌నంది కాంబినేషన్‌లో ‘గబ్బర్‌సింగ్ 2’ సినిమా ప్రారంభం మూడు నెలల కిందటే అవుతుందని పవన్ ఫ్యాన్స్ భావించారు.  కాని కధను పవన్ ఇప్పుడున్న ట్రెండ్‌కు అనుగుణంగా పవన్ మార్పులు చేశాడని ఒకానొక దశలో టాక్ నడిచింది. అందువల్లే డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమా జనవరికి వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇప్పుడేమో ఏకంగా మార్చికే వెళ్ళిపోయినట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా స్క్రిప్ట్ లో హాస్య సన్నివేశాలు పవన్ ఊహించిన స్థాయిలో తయారు కాకపోవడంతో కామెడి ట్రాక్ ను సరిదిద్దే బాధ్యతను పవన్ తన ప్రియనేస్తం త్రివిక్రమ్ శ్రీనివాసుకు అప్పచెప్పడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది అని అంటున్నారు.  జయాపజయాలతో సంబంధంలేని పవన్ అభిమానులు పవన్ సినిమాలకోసం ఎంత కాలమైనా వేచి ఉంటారు అని అంటారు. దీనిని మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలు తెలపండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: