టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు పెద్దగా చెప్పుకుంటున్న న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వర‌రావు మ‌ర‌ణం అంద‌రిని క‌లిచి వేసింది. అక్కినేని నాగేశ్వర‌రావు ఈ రోజు ఉద‌యాన్నే మ‌ర‌ణించాడు అనే వార్త సూర్యోద‌యంలోపే ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు సంబంధించిన అంద‌రికి మేసేజ్ వెళ్ళింది. దీంతో అందుబాటులో ఉన్న అంద‌రూ నిద్రలేచిన వెంట‌నే అన్ని ప‌నులు మానుకొని అక్కినేని నాగాగేశ్వర‌రావు భౌతిక కాయంను సంద‌ర్శించ‌టానికి వ‌చ్చారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా ఓ భారీ మూవీ షూటింగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. పండుగ‌లు, ఆదివారాలు అనే తేడా లేకుండా ఆ మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. అంత‌టి భారీ మూవీనే రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి మూవీ. అక్కినేని నాగేశ్వర‌రావు మ‌ర‌ణ వార్తను విన్న రాజ‌మౌళి ఉద‌యాన్నే వ‌చ్చి భౌతిక కాయానికి నివాళ్ళర్పించాడు. త‌రువాత రామోజి ఫిల్మ్ సిటిలో జ‌ర‌గాల్సిన బాహుబ‌లి మూవీ షూటింగ్‌ను నిలిపేస్తున్నట్టు చిత్ర యూనిట్‌కు చెప్పాడు. 'ఏపిహెరాల్డ్ డాట్ కం' కి అందిన స‌మాచారం మేర‌కు రేపు కూడ బాహుబ‌లి మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఈ విధంగా బాహుబ‌లి మూవీ షూటింగ్ వ‌రుస‌గా రెండు రోజుల క్యాన్సిల్ అయ్యింది.యుద్ద స‌న్నివేశాల‌ను, వీటికి సంభందించిన కంటిన్యూటి షాట్స్‌ను ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటిలో షూటింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: