దాదాపు 90 యేళ్ల వయసున్న అక్కినేని ఎప్పుడు చలాకీగా మాట్లాడుతూ ఇప్పటి తరం కుర్ర హీరోలకు నేను కూడా పోటినే అని అంటుండేవారు.. ఏ ఇంటర్వ్యూ అయినా సరే చాలా కామెడీగా.. ఏమాత్రం భయం లేకుండా అన్ని విషయాలు చెప్పేవారు. ఇక హీరోయిన్ల గురించి ఎప్పుడు హాస్యంగా మాట్లాడుతూ ఉండేవారు అక్కినేని. ఎప్పుడు మీడియా వారు ప్రెస్ మీట్ పెట్టినా చాలా చలాకీగా పాటిస్పేట్ చేసేవారు.. అంత మంచి సద్గునం ఆయనది తను స్వతహాగా నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోలో ఏ సినిమా షూటింగ్ జరిగినా లేదా డబ్బింగ్ కార్యక్రమాలు చేస్తున్నా అవి మంచి సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకునే వారు అక్కినేని నాగేశ్వర రావు గారు. జీవితమంటే పోరాటం ఆ పోరాటాన్ని ఎప్పుడు హెల్దీగా తీసుకోవాలి కానీ ఓడిపోయామని భాదపడకూడదని ఆయన ఎప్పుడు చెబుతుండే వారు. అక్కినేని చనిపోవడం సినీ ఇండస్ర్ట్రీ తీవ్రమైన భాదకు గురిచేసింది..అక్కినేని ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా అనే మాట..అది అభిమానులనుద్దేశించి.. ఆడియెన్స్ వెరైటీని కోరుకుంటున్నారు కాబట్టి వారిని మనం ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదని. అంతే కాదు ఆయన ప్రతి ఇంటర్వ్యూ లో అభిమానులకు ఓ మాట కూడా ఇచ్చారు.. అదే ఆయన సెంచరీ కొట్టకుండా తుది శ్వాస వదలనని కానీ కళాభిమానులకు శాశ్వత జ్ఞాపకాలను మిగిల్చి తను మాత్రం స్వర్గాన్ని చేరుకున్నాడు. అభిమానులు..తారలు..ఎంతో మంది ఆయన మరణానికి నివాళి అర్పిస్తున్నారు.. 'ఏపీ హెరాల్డ్ డాట్ కం' కోరుకునేది ఒక్కటే కోట్లాది అభిమానులు లక్షలాది అరాద్యులు కలిగిన అక్కినేని ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకురాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది. అక్కినేని మరణం అభిమానులు ఏ విధంగా స్పందిస్తారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: