గ‌త కొద్ది రోజుల క్రితం మీడియాలో రామ్‌చ‌ర‌ణ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణవంశీ కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీకు సంబంధించిన టైటిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీకు గోవిందుడి అంద‌రివాడేలే అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జ‌రిగింది. అంద‌రూ ఈ టైటిల్‌ను కృష్ణవంవీ అనౌన్స్‌ చేశాడ‌ని అంటూ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న అప్‌క‌మింగ్ ఫిల్మ్ టైటిల్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ, రామ్‌చ‌ర‌ణ్ మూవీకు సంబంధించిన విశ్వశ‌నీయ‌మైన స‌మాచారం ఎపిహెరాల్డ్‌.కం వ‌ద్ద ఉంది. కృష్ణవంశీ, రామ్‌చ‌ర‌ణ్ మూవీ టైటిల్‌పై క్లారిటి ఇచ్చాడు. 'గోవిందుడు అంద‌రివాడేలే అనే టైటిన్‌ను మేము పెట్టింది కాదు. అస్సులు ఈ మూవీకు ఇంకా టైటిల్ ఫైన‌లైజ్ కాలేదు. చాలా పేర్లను అనుకుంటున్నాము. అందులో ఏ టైటిల్‌ను పెడుతున్నాము అనేది మేము స్వయంగానూ, అఫిషియ‌ల్‌గా తెలియ‌జేస్తాము. అప్పటివ‌ర‌కూ ద‌య‌చేసి గాసిప్స్‌తో కొత్త టైటిల్స్‌ను క్రియోట్ చేయ‌ద్దంటూ' చెప్పాడు. దీంతో గోవిందుడు అంద‌రివాడేలే అనే టైటిల్ పుకారే అని తేలింది. రామ్‌చ‌ర‌ణ్‌, కృష్ణవంశీ కాంబినేష‌న్ ప్రాజెక్ట్ ఫిబ్రవ‌రి 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. రామ్ చరణ్, కాజల గర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అయితే రామ్‌చ‌ర‌ణ్,కృష్ణవంశీ మూవీకు ఏ టైటిల్‌ను పెడితే బాగుంటుంది? అది ప్యామిలి ఓరియంటెడ్ టైలిలా? మాస్‌టైటిలా? మీకు న‌చ్చిన టైటిల్స్ ఎపిహెరాల్డ్‌.కం తో షేర్ చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: