కోలీవుడ్ బ్యూటీ నయన్ తార ఏకంగా నాలుగు సార్లుపెళ్లి చేసుకుంది అనే వార్తలు వాస్తున్నాయి, పెళ్ళికొడుకు మరి ఎవ్వరో కాదు శింబు. శింబు, నయనతార రహస్య వివాహం చేసుకున్నారు అనే వార్తలు కోలీవుడ్ మీడియా ను కుదిపేస్తున్నాయి. మూడో మనిషి లేకుండా నయన్ మెడలో శింబు గప్‌చిప్‌గా తాళి కట్టే సడట. ఆ తర్వాత ఇద్దరూ రిజిస్టర్ ఆఫీసుకి కూడ వెళ్లి, అక్కడ మళ్లీ పెళ్లి చేసుకుంటారట.  అంతేకాదు హిందు సంప్రదాయం ప్రకారం ఓసారి, క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి ఇలా మొత్తం నాలుగుసార్లు పెళ్లి చేసుకొబోతున్నారు ఈ జంట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఒకప్పుడు శింబు, నయనతార ప్రేమించుకోవడం, ఆ తర్వాత విడిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అలా విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం కూడా మానేశారు.  ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఐదు సంవత్సరాలు దాటిపోయింది. ఇన్నాళ్ళ తరువాత శింబు, నయనతారలు కలిసి నటిస్తున్న ఒక తమిళ సినిమాలో ఈ నాలుగు పెళ్లిళ్లూ జరుగుతాయి. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ లొకేషన్‌లో గతంలోలా శింబు, నయనతార చాలా ఫ్రెండ్లీగా ఉంటు అందరికి షాక్ ఇస్తున్నారు.  షూటింగ్ విరామ సమయంలో ఇద్దరూ జోక్స్ వేసుకుని నవ్వుకోవడంతో పాటు చాల క్లోజ్ గా ఉండటం చూస్తూ ఉంటే నిజంగానే ఈ సినిమాలోని సన్నివేసాలులా త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని కోలీవుడ్ మీడియా రాస్తున్న వ్రాతలను మీరు నమ్ముతారా? త్వరలో ఈ మాజీ ప్రేమికులు కలిసిపోతారా? అనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వార మాకు తెలియచేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: