అక్కినేనిని కడసారి చూడడానికి టాలీవుడ్ అంతా కలిసి వచ్చినా అక్కినేనిని ప్రేమతో బాబాయ్ అని పిలిచే బాలకృష్ణ అక్కినేని అంతిమయాత్రకు హాజరుకాకపోవటం టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై రకరకాల రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. అదేవిధంగా బాలకృష్ణకు గాయం అయింది అనే వార్తలు కూడా వినపడుతున్నాయి.  అయితే బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చి అక్కినేని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మరోప్రక్క బాలకృష్ణ అన్న హరికృష్ణ,అల్లుడు లోకేష్,కూతురుతో సైతం వచ్చారు. కానీ బాలకృష్ణ రాకపోవటం అనే విషయం సోషల్ మీడియా వెబ్ సైట్లలో,ఛానెల్స్ లో వార్తగా ప్రచారంలోకి వెళ్తోంది . దాదాపు ఏడున్నర దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు నిన్న అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉంటే ఒక వేళ బాలయ్య తన ఆరోగ్య కారణాల రీత్యా అక్కినేని అంతిమ యాత్రకు రాలేకపోయినా ఒక పత్రికా ప్రకటన రూపంలో అయినా తన సంతాపాన్ని తెలియచేసి ఉంటే ఎంతో బాగుండేదని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.  వాస్తవాలు ఎటువంటివైనా బాలయ్య అక్కినేని మృతదేహం వద్దకు ఎందుకు రాలేదు అన్నది సమాధానం లేని ప్రశ్నలు. తెలుగు సినిమా రంగానికి రెండు కళ్ళు లాంటి ఎ.ఎన్.ఆర్.-ఎన్.టి.ఆర్. లు దూరమైపోయినా ఆ కుటుంబ వారసులుగా టాలీవుడ్ కు నాయకత్వం వహించడంలో బాలయ్య-నాగార్జునులు ఎంతవరకు సఫలీకృతం అవుతారో రానున్న కాలం చెపుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: