నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణంతో యావత్ సినిమా ప్రపంచం, అక్కినేని అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఇంకా విషాదం నుండి తేరుకోకుండానే రాష్ట్ర అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా అయ్యాయి.  మీఅభిమాన పోర్టల్ ఎపిహెరాల్డ్.కామ్ కు అందుతున్న సమాచారం ప్రకారం ఈ శాసన సభ్యుడు అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియో కోసం తక్కువ రేట్లకు పేదల భూములను ధారాదత్తం చేసారు అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఓ వైపు అక్కినేని మరణించిన సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ అసందర్భ వ్యాఖ్యలతో పలువురు ఆశ్చర్య పోయారు.  ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కినేనిని అవమానించడమే అని పలువురు అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. విషాద సందర్భంలో ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడి ఉండకూడదని కూడ అభిప్రాయపడుతున్నారు.  కారుచౌకగా భూములు అన్నపూర్ణ స్టూడియోస్ కు ఇచ్చిన విషయంలో నిజాలు ఎన్నో తెలియక పోయినా తెలుగు సినిమా పరిశ్రమకు సంభందించి హైదరబాద్ కు పరిశ్రమ తరలి రావడంలో అన్నపూర్ణ స్టూడియోస్ అభివృద్దిలో అక్కినేని పాత్ర అత్యంత ప్రాముఖ్యమని ఎవరైనా అంగీకరించవలసిన విషయం. ఎవరు కాదన్నా అవునన్నా తెలుగు సినిమా రంగ చరిత్రలో ఆయన స్థానాన్ని ఎవరు పూరించ లేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: