ఇప్పటికే పెళ్లి చేసుకొని ఓ బేబితో లైఫ్‌లో సెటిల్ కావాల్సిన న‌య‌న‌తారా జీవితం, అనూహ్యంగా మ‌లుపుతిరిగి చివ‌రిని య‌థాత‌థంగా సినీ జీవితాన్ని గ‌డుపుతుంది. ప్రభుదేవాతో న‌య‌న‌తారా న‌డిపిన రొమాన్స్ ఒక్క టాలీవుడ్‌, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లోనే కాదు, యావ‌త్ ఇండియన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఇది హాట్ టాపిక్‌గా మారింది. కాని పెళ్ళి వ‌ర‌కూ వెళ్ళాల్సిన వీరి క‌థ‌, మ‌ధ్యలోనే బ్రేక్ అప్ జ‌రిగి మ‌రింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధంగా న‌య‌న‌తార సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే న‌య‌న‌తార సెకండ్ ఇన్నింగ్స్‌లో కుర్రహీరోల‌తో పాటు, ముదురు హీరోలు సైతం త‌న‌తో ఎఫైర్ న‌డ‌ప‌టానికి ఇష్టప‌డుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో న‌య‌న‌తార‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క అభిమానులు మాత్రమే కాకుండా, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పెద్ద హీరోలు సైతం న‌య‌న‌తార‌తో మాట్లాడి, ఏదోఒక‌టి చేయాల‌ని తెగ ప్రయ‌త్నిస్తుంటారు. ఆ విధంగానే ఓ యువ హీరో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారాడు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుండి ఎపిహెరాల్డ్‌.కం కి అందిన స‌మాచారం ప్రకారం న‌య‌న‌తారా మ‌రోసారి ఉధయనిధి స్టాలిన్ సరసన న‌టించింది. వీరు నటించిన ‘ఇదు కథిర్వెలన్ కాదల్’ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ మూవీ హీరోగా న‌టించిన స్టాలిన్‌తో న‌య‌న‌తార డేటింగ్ న‌డుపుతుంద‌ని కోలీవుడ్ నుండి అందిన స‌మాచారం. ఈ విష‌యాన్ని కోలీవుడ్‌కు చెందిన లీడింగ్ టాబ్లాయిడ్ ప‌బ్లిష్ కాగ, ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: